అడుక్కునే వారికి 43లక్షల లాటరీ

Admin - October 9, 2020 / 12:49 PM IST

అడుక్కునే వారికి 43లక్షల లాటరీ

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలీదు. కొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అనేక మార్గాలుగా ఎంచుకుంటారు. అయితే ఓ నలుగురు యాచకులకు లాటరీ తగిలి రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యారు. వివరాల్లోకి వెళితే ఫ్రాన్స్‌ లోని బ్రెస్ట్‌ నగరంలో నలుగురు యాచకులకు ఏకంగా 43 లక్షల లాటరీ తగిలింది. అయితే ఓ లాటరీ షాపు దగ్గర ఈ నలుగురు యాచకులు అడుక్కుంటుంటే ఒక వ్యక్తి యూరో పెట్టి కొనుగోలు చేసిన స్క్రాచ్‌ కార్డును వీరికి ఇచ్చాడు. ఆ కార్డు నుండి లాటరీ వస్తుందని పాపం అతడికి కూడా తెలియదు.

ఒకవేళ అది లాటరీ అని తెలిస్తే ఆ కార్డును ఇచ్చేవాడు కాదేమో.. అయితే ఆ వ్యక్తి ఇచ్చిన కార్డుతో ఆ యాచకులకు జాక్‌పాట్‌ తగిలింది. ఇక ఆ యాచకులకు లాటరీ తగిలిందని తెలియగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక లాటరీలో వచ్చిన డబ్బును నలుగురు యాచకులు సమానంగా పంచుకున్నారు. నిజంగా అదృష్టం ఎప్పుడు, ఎలాంటి రూపంలో వస్తుందో ఎవ్వరికీ తెలీదు అనే మాటలు వీరే నిదర్శనంగా మారారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us