Jabardasth Tanmay : డ్రంక్ డ్రైవ్‌లో పోలీసుల‌కు దొరికిన జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ

Jabardasth Tanmay : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్విస్తున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతున్న ఈ కార్య‌క్ర‌మంతో ఎంతో మంది క‌మెడీయ‌న్స్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. కొంద‌రు ఈ షో కోస‌మ‌ని జెండక్ కూడా మార్చుకున్నారు. లోప‌ల ఎన్ని బాధ‌లు ఉన్న‌ప్ప‌టికీ ఎల్ల‌ప్పుడు వీరు ప్రేక్ష‌కుల‌ని న‌వ్వించేందుకు కృషి చేస్తుంటారు. అప్పుడ‌ప్పుడు వివాదాల‌లో కూడా ఇరుక్కుంటారు.

తాజాగా త‌న్మ‌య్ అనే క‌మెడీయ‌న్ శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప‌ట్టుబ‌డ్డాడు. తాగి వాహ‌నం న‌డుపుతున్నాడ‌నే కార‌ణంగా అత‌నితో పాటు ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్స్‌ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వెస్ట్ జోన్ జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహించిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 5 కార్లు , 2 ఆటోలు, 12 బైక్‌లను పోలీసులు పట్టుకున్నారు. త‌ప్ప‌తాగి డ్రైవ్ చేయ‌డ‌మే కాక కొంద‌రు పోలీసుల‌తో దూష‌ణ‌కు కూడా దిగార‌ట‌. కాగా, త‌న్మ‌య్ ఎక్కువ‌గా లేడీ గెట‌ప్స్‌లో జ‌బ‌ర్ధ‌స్త్ షోలో వినోదం పంచుతున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement