Jabardasth Varsha Going Participate In Bigg Boss 7 : బిగ్ బాస్-7లోకి జబర్దస్త్ వర్ష.. నోరు జారి ముందే చెప్పేసిన బ్యూటీ..!
NQ Staff - July 24, 2023 / 10:18 AM IST

Jabardasth Varsha Going Participate In Bigg Boss 7 :
జబర్దస్త్ కు బుల్లితెరపై పిచ్చ క్రేజ్ ఉంది. ఆ షోకు ఎవరు వెళ్లినా సరే ఇట్టే ఫేమస్ అయిపోతున్నారు. ఇక బుల్లితెర మీద ఫేమస్ అవుతున్న వారంతా బిగ్ బాస్ హౌస్ కు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే కదా. ఎందుకంటే బిగ్ బాస్ తో ఒక్కసారిగా స్టార్ అయిపోవచ్చిన అంతా ఆశపడుతున్నారు.
ఇక త్వరలోనే బిగ్ బాస్-7 సీజన్ స్టార్ట్ కాబోతోంది. ఈ షోకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి బడా కంటెస్టెంట్స్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా జబర్దస్త్ వర్ష పేరు కూడా బలంగా వినిపిస్తోంది. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందాలతో ఎప్పటికప్పుడు కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది.
ఆ ఇంటర్వ్యూలో..
ఇదిలా ఉండగా రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నాకు హీరోయిన్ గా చేయాలని అస్సలు లేదు. అక్క, వదిన లాంటి పాత్రలు చేయాలని ఉంది. సినిమాల్లోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నా. త్వరలోనే ఓ పెద్ద షోలో పాల్గొనబోతున్నా. ఇప్పటికే దాని కోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నా.
నేను ఏం చదువుకున్నాను, నా జీవితంలో జరిగిన మంచి ఏంటి అనేది అన్నీ అక్కడ చెప్తా అంటూ ఎమోషనల్ అయింది వర్ష. పెద్ద షో అంటే బిగ్ బాస్ కాకపోతే ఇంకేముంది. పైగా అదే రియాల్టీ షో. అన్నీ అక్కడ చెప్తా అంటూ వర్ష చెప్పింది అంటే అది కచ్చితంగా బిగ్ బాస్ మాత్రమే. అంటే ఆమెను త్వరలోనే హౌస్ లో చూడబోతున్నాం అన్నమాట.