Jabardasth Rithu Chowdary : రహస్యంగా పెండ్లి చేసుకున్న జబర్దస్త్ బ్యూటీ.. అంతా షాక్..!
NQ Staff - June 13, 2023 / 11:43 AM IST

Jabardasth Rithu Chowdary : ఈ నడుమ ఎప్పుడు ఎవరు పెండ్లి చేసుకునే విషయం అస్సలు తెలియట్లేదు. కొందరు సడెన్ గా పెండ్లి చేసుకుని షాక్ ఇస్తున్నారు. రీసెంట్ గానే శర్వానంద్ రక్షితరెడ్డిని పెండ్లి చేసుకున్నాడు. అలాగే వరుణ్ తేజ్ కూడా తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని మొన్ననే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.
కాగా ఇప్పుడు జబర్దస్త్ బ్యూటీ పెండ్లి పీటలు ఎక్కినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు రీతూ చౌదరి. ఆమె సీరియల్స్, జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి బుల్లితెరపై సందడి చేస్తోంది. కాగా ఆమె గతంలో ఓ వ్యక్తిని పెండ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించింది.
అతనితో క్లోజ్ గా దిగిన ఫొటోలను కూడా పంచుకుంది. అతను తనకు కాబోయే భర్త అని చెప్పింది. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి అతనితో ఫొటోలు దిగట్లేదు. రీసెంట్ గానే రీతూ ఇంట్లో విషాదం జరిగింది. ఆమె తండ్రి చనిపోయాడు. ఆ బాధ నుంచి తేరుకున్న రీతూ.. మళ్లీ నార్మల్ అయిపోయింది.
ఈ క్రమంలోనే సింపుల్ గా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. అతికొద్ది సన్నిహితుల నడుము రీతూ చౌదరి పెళ్లి చేసుకుంది. తాను గతంలో చెప్పిన వ్యక్తితోనే పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆమె సన్నిహితులు మాత్రం ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు.