Mimicry Murthy : విషాదం.! అనారోగ్యంతో జబర్దస్త్ నటుడు కన్నుమూత.!

NQ Staff - September 27, 2022 / 08:41 PM IST

Mimicry Murthy : విషాదం.! అనారోగ్యంతో జబర్దస్త్ నటుడు కన్నుమూత.!

Mimicry Murthy : జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది కమెడియన్లను బుల్లితెర వీక్షకులకు పరిచయం చేసింది. అంతే కాదు, వెండితెరకీ ఎంతోమంది కమెడియన్లను అందించింది. కేవలం కమెడియన్లే కాదు, బోల్డంత టాలెంట్ జబర్దస్త్ వేదికగా ప్రపంచానికి పరిచయమయ్యిందని చెప్పొచ్చు.

ఆ లిస్టులో ‘మూర్తి’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రంగస్థల కళాకారుడైన మూర్తి, జబర్దస్త్ వేదికపై మంచి కామెడీ పండించాడు. మిమిక్రీ చేయడంలో దిట్ట. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలలో మూర్తి చాన్నాళ్ళ పాటు అలరించాడు.

క్యాన్సర్‌తో కన్నుమూసిన మూర్తి…

గత కొంతకాలంగా మూర్తి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయితే, క్యాన్సర్ మహమ్మారి ఆయన్ని తీవ్రంగా కుంగదీసింది. దాంతో, ఆయన కోలుకోలేకపోయాడు. క్యాన్సర్ మహమ్మారితో పోరాటంలో ఓడిపోయాడు, తనువు చాలించాడు మూర్తి.
మూర్తికి క్యాన్సర్ సోకాక, పలువురు జబర్దస్త్ నటులు ఆయనకు అవకాశాల పరంగా అలాగే ఆర్థికంగా కూడా కొంతమేర తోడ్పాటునందించినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ మూర్తి మరణం పట్ల సాటి కమెడియన్లు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. బుల్లితెరతోపాటు సినీ ఇండస్ట్రీలో కూడా మూర్తి మరణం పట్ల విషాదం నెలకొంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us