Jabardasth Comedian Pavitra : వామ్మో.! పెళ్ళి విషయంలో పవిత్ర ఇంత పెద్ద షాక్ ఇచ్చిందేంటి.?

NQ Staff - December 12, 2022 / 02:16 PM IST

Jabardasth Comedian Pavitra  : వామ్మో.! పెళ్ళి విషయంలో పవిత్ర ఇంత పెద్ద షాక్ ఇచ్చిందేంటి.?

Jabardasth Comedian Pavitra  : పవిత్ర అంటే సినీ నటి పవిత్ర కాదండోయ్.! పవిత్ర పెళ్ళి అనగానే, సీనియర్ నటి పవిత్ర.. సీనియర్ నటుడు నరేష్ వ్యవహారమే ముందుగా అందరికీ గుర్తొస్తోంది. వారిద్దరి చుట్టూ అంత పెద్ద రచ్చ జరుగుతోంది మరి.!

ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న పవిత్ర వేరు. ఈమె ఓ కమెడియన్. కమెడియన్లలో లేడీ కమెడియన్లు చాలా అరుదు. జబర్దస్త్ పుణ్యమా అని లేడీ కమెడియన్లు కూడా పాపులర్ అవుతున్నారు. అలా పాపులర్ అయిన జబర్దస్త్ కమెడియన్ పవిత్ర.. పెళ్ళి గురించి ప్రకటించి అందరికీ పెద్ద షాకే ఇచ్చింది.

జబర్దస్త్ నటుడితో ప్రేమ.!

పవిత్ర వివాదాలకు దూరంగా వుంటుంది. వివాదాస్పద కామెంట్లు చేయదు. మంచి టైమింగ్‌తో కూడిన కామెడీ ఆమె సొంతం. సొంతంగా ఓ యూ ట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది పవిత్ర గత కొంతకాలంగా. ఆ యూ ట్యూబ్ ఛానల్ ద్వారానే తన పెళ్ళి షాపింగ్ గురించి ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది.

Jabardasth Comedian Pavitra Going Get Married

Jabardasth Comedian Pavitra Going Get Married

పబ్లిసిటీ స్టంటు కాదు కదా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు పవిత్ర పెళ్ళి గురించి తెలిసి. జబర్దస్త్‌లోనే కమెడియన్‌గా రాణిస్తున్న తేజ అనే వ్యక్తిని పెళ్ళాడబోతోందిట పవిత్ర. వీరిద్దరి మధ్యా ఏదో జరుగుతోందంటూ కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. అదే ఇప్పుడు నిజమయ్యేలా వుంది.

అన్నట్టు, జబర్దస్త్ కామెడీ షో సినిమాటిక్‌గా చాలా పెళ్ళిళ్ళు చేసేసింది. రికార్డు స్థాయిలో పెళ్ళిళ్ళు జరిగింది మాత్రం సుధీర్ – రష్మిలకే. అది జస్ట్ ఫన్ కోసం.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us