Jabardasth Apparao : హైపర్ ఆది ఎవరినీ ఎదగనివ్వడు.. జబర్దస్త్ అప్పారావు సంచలన కామెంట్లు..!

NQ Staff - June 8, 2023 / 02:52 PM IST

Jabardasth Apparao : హైపర్ ఆది ఎవరినీ ఎదగనివ్వడు.. జబర్దస్త్ అప్పారావు సంచలన కామెంట్లు..!

Jabardasth Apparao  : బుల్లితెరపై జబర్దస్త్ అనేది ఎంతో మందికి స్టార్ స్టేటస్ ను తెచ్చి పెట్టింది. ఈ షో కారణంగా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో హైపర్ ఆది కూడా ఉన్నారు. ఆయనకు ఓ స్టార్ కమెడియన్ కు ఉండాల్సినంత ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు మల్లెమాల నుంచి సుధీర్ వెళ్లిపోయిన తర్వాత ఆయనే నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నాడు.

ఆయన చెప్పినట్టే స్క్రిప్ట్ లు, ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. కాగా సుధీరో వెళ్లిపోయిన తర్వాత చాలామంది జబర్దస్త్ ను వీడారు. అలాంటి వారిలో అప్పారావు కూడా ఒకరు. ఆయన కొన్ని రోజులు కామెడీ స్టార్స్ లో చేశారు. కానీ ఇప్పుడు పెద్దగా బయట కనిపించట్లేదు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇందులో ఆయన మాట్లాడుతూ జబర్దస్త్ లో జరుగుతున్న వాటిని బయట పెట్టారు. అక్కడ బయటకు కనిపించే విధంగా ఉండదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొత్త ఆర్టిస్టులకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. పైగా ఎవరికి వారు లైన్లు రాసుకున్నా సరే హైపర్ ఆది ఫైనల్ చేస్తూ ఉంటాడు.

షో మొత్తం ఆయనే కనిపించాలని అనుకుంటాడు. అంతే తప్ప వేరే వారికి ఎదిగే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు అక్కడ హైపర్ ఆది ఏం చెబితే అదే జరుగుతోంది. అందరూ ఆయన లైన్ లో నే నడవాలి. అలా జరగడం వల్ల మిగతా వారికి గుర్తింపు రావట్లేదు.

అంతటా ఆయనే కనిపిస్తున్నాడు. అందుకే చాలామంది అక్కడి నుంచి వచ్చేస్తున్నారు అంటూ బాంబు పేల్చాడు అప్పారావు. మరి ఆయన చేసిన కామెంట్లపై ఆది ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us