Jabardasth Apparao Emotional Comments : నన్ను బ్రతికి ఉండగానే చంపేస్తున్నారు.. జబర్దస్త్ అప్పారావు ఎమోషనల్..!
NQ Staff - June 27, 2023 / 11:47 AM IST

Jabardasth Apparao Emotional Comments : లేటు వయసులో వచ్చినా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు జబర్దస్త్ అప్పారావు. గత 30 ఏండ్లుగా ఆయన రంగస్థల నటుడిగా కొనసాగుతున్నారు. కానీ ఎవరికీ పెద్దగా తెలియదు. కేవలం జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే ఆయన ఫేమస్ అయ్యారు. ఆ షో కారణంగా ఆయనకు ఎంతో గుర్తింపు లభించింది.
కానీ అనుకోకుండా ఆయన జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు. కొన్ని రోజులు స్టార్ మాలో చేసిన ఆయన.. ఆ తర్వాత అక్కడ కూడా కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నారు. కొన్ని ఈవెంట్లకు మాత్రం వెళ్తున్నారు. కాగా ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేశారు.
నేను ఈ మధ్య యూట్యూబ్ ఛానెల్స్ వారు చేస్తున్న హంగామాతో చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను కాదు చాలామంది సినిమా సెలబ్రిటీలు నాలాగా ఇబ్బంది పడుతున్నారు. నేను బ్రతికి ఉండగానే చనిపోయానంటూ కొందరు వీడియోలు చేశారు. దాంతో చాలా బాధగా అనిపించింది.
బ్రతికి ఉండగానే ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. నా మీదనే కాదు చాలామంది మీద ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. నేను వారికి ఒకటే చెబుతున్నాను. ఇలాంటి వీడియోలు చేసే అధికారం మీకు లేదు. అందరం చనిపోతాం.
చనిపోయే వరకు అయినా ఆగండి. అంతే గానీ ఇలాంటి పిచ్చి వీడియోలతో డబ్బులు సంపాదించాలని మాత్రం అనుకోకండి అంటూ ఎమోషనల్ అయ్యారు అప్పారావు.