Mallareddy : మంత్రి మల్లారెడ్డి ఇంట ఐటీ రైడ్స్‌.. తనయుడికి ఛాతి నొప్పి

NQ Staff - November 23, 2022 / 09:41 AM IST

Mallareddy : మంత్రి మల్లారెడ్డి ఇంట ఐటీ రైడ్స్‌.. తనయుడికి ఛాతి నొప్పి

Mallareddy : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజులుగా మల్లారెడ్డి ఇంట్లో మరియు కుటుంబ సభ్యులకు చెందిన వ్యాపార సముదాయాలు, ఆఫీసుల్లో మరియు విద్యా సంబంధిత ఆఫీసుల్లో పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి.

ఐటీ సోదాల్లో అక్రమ ఆస్తులు మరియు డబ్బు నిల్వలు బయటపడుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

మహేందర్ రెడ్డి అరెస్ట్‌ వార్తలు వస్తున్న నేపథ్యంలో టిఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇదే సమయంలో మహేందర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని… చాతిలో నొప్పితో స్థానిక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు.

హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా మల్లారెడ్డి ఫ్యామిలీకి చెందిన పలు ఆఫీసుల్లో 50 బృందాలు ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి, ఈ ఒత్తిడితోనే మహేందర్ రెడ్డి కి చాతిలో నొప్పి వస్తున్నట్లుగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది.. మల్లా రెడ్డి ఫ్యామిలీకి చెందిన ఆఫీస్ ల్లో ఎంత మొత్తం వెలుగు లోకి వచ్చింది అనే విషయాన్ని ఐటీ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. కానీ మల్లారెడ్డి మాత్రం తమ వద్ద ఏమీ లభించలేదు అన్నట్లుగా చెబుతున్నాడు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us