Minister Malla Reddy : మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల ఫిర్యాదు.!

NQ Staff - November 24, 2022 / 05:06 PM IST

Minister Malla Reddy : మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల ఫిర్యాదు.!

Minister Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు ఐటీ అధికారుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది.

మరోపక్క, మంత్రి మల్లారెడ్డి సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్ళు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులపై ఐటీ అధికారులు రెండ్రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇళ్ళపైనా ఐటీ సోదాలు జరిగాయి.

కుమారుడ్ని కొట్టి బలవంతంగా సంతకం పెట్టించారు..

‘నా కుమారుడ్ని తీవ్రంగా కొట్టారు.. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. ఐటీ సోదాలు కొత్తేమీ కాదు. కానీ, ఈసారి భిన్నంగా జరుగుతున్నాయి..’ అని మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు.

ఐటీ అధికారులు చేయించుకున్న సంతకాలపై విచారణ జరగాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాగా, తమ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించారని మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు పిర్యాదు చేశారు.

ఇప్పటిదాకా జరిపిన సోదాల్లో ఐటీ అధికారులకు ఆరు కోట్ల రూపాయల మేర నగదు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు దొరికినట్లు తెలుస్తోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us