IT Notices to Chandrababu : కాంట్రాక్టుల పేరుతో వసూళ్లు.. చంద్రబాబుకు ఐటీ అధికారుల నోటీసులు..!
NQ Staff - September 3, 2023 / 07:35 PM IST

IT Notices to Chandrababu : చంద్రబాబుపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అందులో చాలా వరకు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన అవినీతి, అక్రమాలు చేశారని చాలా మంది సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టారు. కానీ చంద్రబాబు తన అంగబలం ఉపయోగించి ఏ కేసు కూడా నిలబడకుండా చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చాలా కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించారు. కానీ ఏ ఒక్క కంపెనీని కూడా వదల్లేదు. తనకు అందాల్సిన ముడుపులు అందే వరకు ఆ కంపెనీలను నిద్ర పోనివ్వలేదంట.
ఇందుకు ఓ ఉదాహరణే ఇప్పుడు మీ ముందుకు తెస్తున్నాం. గతంలో టీడీపీ హయాంలో షాపూర్జీ పల్లోంజీ ఇంకా లార్సన్ టూబ్రో సంస్థలు కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు నిర్మించాయి. అలాగే అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులు కూడా చేశాయి. 2018లో చేసిన ఈ నిర్మాణాలన్నీ రూ.8వేల కోట్ల విలువ చేసేవిగా ఉన్నాయి. అయితే ఈ కాంట్రాక్టు పనుల్లో చాలా లోపాయకారి ఒప్పందాలు జరిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ఒప్పందాల ప్రకారమే చంద్రబాబు అసెంబ్లీ, సెక్రటేరియట్ తాత్కాలిక భవనాల కోసం ఇచ్చిన రేటు చాలా ఎక్కువ.
ఎంత అంటే 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్ట్ ఏకంగా రూ.600 కోట్లకు పైగానే ఉంది. అంటే ఒక్కో చదరపు అడుగుకు రూ.10 వేల కంటే ఎక్కువగా చెల్లించారు. మన దేశంలో ఏ లగ్జరీ అపార్టుమెంట్ నిర్మాణం కూడా ఇంత ధరకు అమ్మడం లేదు. కానీ చంద్రబాబు ఇలా కాంట్రాక్టుల పేరుతో తిరిగి తన బినామీలకు ఆ డబ్బులు చేరే విధంగా ప్లాన్ వేసి.. ఇలా ఇచ్చేశారంట. అదొక్కటే కాదు టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కూడా ఇలాంటి పనే చేశారు. చదరపు అడుగుకు రూ. 2200 చొప్పున ఇళ్లు ఇచ్చారు. అప్పట్లో ఆ ఇంటి నిర్మాణం ఒక చదరపు అడుగుకు రూ.1000 కి మించదు.
కానీ పేదల జేబు కొట్టి చంద్రబాబు ఇలా దోచేశారని ప్రతిపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. ఇలా ఖర్చులను పెంచేసి పేదలు 20 ఏళ్ల పాటు తిరిగి చెల్లించేలా చేసిన ఘనత ఆయనదే. అయితే ఇలా అధిక ధరలకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం చంద్రబాబు ఆ కంపెనీలకు ఓ షరతు కూడా పెట్టారంట. తన పీఏ శ్రీనివాస్ ద్వారా రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నారని బయట పడింది. ఇందుకోసం ఏకంగా మూడు నకిలీ కంపెనీలను సృష్టించి వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ పనులు చేసినట్టు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారంట చంద్రబాబు. అలా ఆ డబ్బులను తన వద్దకు తెచ్చేసుకున్నారు.
ఈ విషయాలు మొన్న షాపూర్జీ పల్లోంజీ సంస్థకు చెందిన కన్సల్టెంట్ మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చెందిన సంస్థల్లో ఐటి అధికారులు దాడులు చేయగా బయట పడింది. ఆయన ఇంట్లో దొరికిన ఓ చిన్న ఆధారాన్ని పట్టుకుని లాగితే ఈ డొంకంతా బయట పడింది. తమకు అధిక ధరలకు పనులు ఇచ్చినందుకు చంద్రబాబు పార్టీ ఫండ్ కింత రూ.118 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో గత్యంతరం లేక ఆయన పీఏ శ్రీనివాస్‌కు ఆ ముడుపులు సమర్పించుకున్నారని ఐటీ అధికారుల దాడుల్లో తేలింది.
ఈ వ్యవహారంలో చంద్రబాబుకు సెక్షన్ 127,ఇంకా 153C సెక్షన్ల కింద ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు జరీ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తనకు నోటీసులు ఇవ్వాల్సిన పద్ధతి ఇది కాదంటూ ఐటీ అధికారులకే రూల్స్ చెబుతున్నారు. పలుమార్లు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చినా దానిపై చంద్రబాబు పెద్దగా స్పందించట్లేదు. సమాధానాలు చెప్పలేక మిన్నకుండిపోతున్నారు.