It Notice To Chandra Babu : కోడ్ భాషతో చంద్రబాబు పీఏ వసూళ్లు.. గుర్తించిన ఐటీ అధికారులు..
NQ Staff - September 5, 2023 / 12:03 PM IST

It Notice To Chandra Babu : మామూలుగా మనకు సినిమాల్లో డ్రగ్స్ మాఫియా, లేదంటే హవాళా గ్యాంగ్స్ మధ్యలో కొన్ని కోడ్ భాషలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎవరికీ అర్థం కావు. కేవలం ఇచ్చే వారికి, తీసుకునే వారికి తప్ప మామూలు మనుషులకు తెలియని కోడ్స్ ను వాడుతుంటారు. ఇప్పుడు చంద్రబాబు అండ్ గ్యాంగ్ కూడా ఇలాంటి కోడ్ భాషనే వాడేసిందని టాక్ బయటకు వచ్చింది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు షాపూర్జీ పల్లోంజి, అండ్ టూబ్రో సంస్థలకు ఏపీలో భారీగా కాంట్రాక్టు పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపనలు కూడా వచ్చాయి.
ఎందుకంటే చంద్రబాబు చాలా ఎక్కువ ధరలకు కాంట్రాక్టు పనులు అప్పగించారు. అందుకే చంద్రబాబు పీఏకు ముడుపులు కూడా చెల్లించారు షాపూర్జీ పల్లోంజి సంస్థల మేనేజ్ మెంట్. మొన్న సదరు కాంట్రాక్ట్ కంపెనీలకు కన్సల్టెంట్ గా పని చేస్తున్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని ఆఫీసుల్లో సోదాలు నిర్వహించగా కొన్ని ఆధారాలు బయట పడ్డాయి. వాటి ఆధారంగా ఎంక్వయిరీ చేయిస్తే ఈ ముడుపుల వ్యవహారం మొత్తం బయట పడింది. తమ కంపెనీలకు ఎక్కువ ధరలకు పనులు ఇచ్చినందుకు చంద్రబాబు పార్టీ ఫండ్ పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్టు వాసుదేవ్ ఒప్పుకున్నారు.
అందుకోసం చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా రూ. 118 కోట్ల ముడుపులు చెల్లించారంట. అయితే ఈ మొత్తం వ్యవహారం కోసం మొత్తం కోడ్ భాషను వాడినట్టు ఐటీ అధికారుల విచారణలో తేలింది. చంద్రబాబు తీసుకున్నారు. ఆయితే ఈ వ్యవహారంలో ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు అంతా కోడ్ భాషను వినియోగించారు. మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చంద్రబాబు పీఏకు మధ్య నడిచిన చాట్ సంభాషణ, డబ్బుల చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్ తదితర ఆధారాలను సైతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ చాట్ లో ఎవరికి ఎలా డబ్బులు పంపాలో కోడ్ భాషలో చర్చించుకున్నారు. హైదరాబాద్ లోని వారికీ డబ్బు వేయాలంటే HYD అని, విజయవాడలోని తమ అనుచరులకు డబ్బులు పంపాలి అంటే విజయ్ అని, విశాఖలోని వారికి పంపాలి అంటే విష్ అని, బెంగళూరు వారికి ఐతే బాంగ్ అని వారిమధ్య వాట్సాప్ చాట్ నడిచింది. ఇందులో ఎక్కడా కూడా డబ్బు, క్యాష్ అనే పదాలు వాడలేదు. డబ్బుకు బదులు స్టీల్ అని అన్నారు.. స్టీల్ అంటే డబ్బు అని అర్థం. టన్ను అంటే కోటి అనే అర్థం వచ్చేలా వారిమధ్య కోడ్ భాషను వాడారు.
ఇలాంటి కోడ్ భాషను వాడేసి కోట్లు కొట్టేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంలో ఇప్పటికే చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం ఐటీ అధికారులకే రూల్స్ చెబుతూ కాలం వెల్లదీస్తున్నారు. కానీ ఐటీ విచారణకు మాత్రం వెళ్లట్లేదు. పైగా ఈ విషయం మీ పరిధి కాదంటూ 2022 అక్టోబర్ 10, 27న… 2023, జనవరి 31, జూన్ 20 తేదీల్లో ఆదాయపుపన్ను శాఖవారికి చంద్రబాబు లేఖలు కూడా రాశారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ బీజేపీతో చేతులు కలిపేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగూ కేసులు అయ్యేలా ఉన్నాయనే టెన్షన్ లోనే ఆయన బీజేపీ అండ కోసం వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది.