ఈ మహిళల ఐలాండ్ గురించి తెలుసా!

Advertisement

వాటర్ ప్రదేశాలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. వాటర్ ప్రదేశాలను ఇష్టపడే వారికి ఐలాండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో చాలా ఐలాండ్ ఉన్నాయి. అక్కడికి వెళ్లేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. అయితే ప్రతి ఐలాండ్ కు కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాగే ఫిన్ ల్యాండ్ తీరప్రాంతంలో 8.4 ఎకరాల్లో ఉన్న ‘సూపర్ షీ’ ఐలాండ్ లో ఉన్న నిబంధన ఏంటంటే అక్కడికి కేవలం అమ్మాయిలు మాత్రమే వెళ్ళాలి. అక్కడ అబ్బాయిలకు అనుమతి ఉండదు. అమెరికాకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త క్రిస్టినా రోత్ ఈ ఐలాండ్ ను రూపొందించారు.

ఇక్కడ అన్ని పనులు కేవలం అమ్మాయిలు మాత్రమే నిర్వహిస్తారు. ఈ ఐలాండ్ లో మహిళకు కావలసిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. అక్కడ రెస్టారెంట్స్, స్పా, అడ్వెంచర్ యాక్టివిటీస్, ఆరోగ్యం దృష్ట్యా యోగ, ధ్యానం చేయించే క్లాసులు కూడా ఇక్కడ ఉన్నాయి. మహిళలు స్వేచ్ఛగా జీవించడానికి ఈ ఐలాండ్ ను ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు. బయటి ప్రపంచంలో దొరకని స్వేచ్ఛను మహిళలు ఇక్కడ పొందవచ్చు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here