ఐఎస్ఐ ఏజెంట్ ను అరెస్ట్ చేసిన అధికారులు

Advertisement

దేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరించే వారు చాలామంది ఉన్నారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ అయిన ఐఎస్ఐ తీవ్రవాద సంస్థకు ఏజెంట్ గా పనిచేస్తున్న వ్యక్తిని గుజరాత్ లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ ఖచ్ జిల్లా ముంద్రా రేవులో నిందితుడు రాజాకభాయ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన ఓ కేసు విచారణలో లభించిన ఆధారాలతో ఎన్‌ఐఏ నేడు అతడిని అదుపులోకి తీసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం మొదట ఉత్తరప్రదేశ్ లో పోలీసులకు చిక్కిన నిందితుడు ఎం.డి.రషీద్ పాకిస్థాన్‌కు చెందిన రక్షణ, ఐఎస్ఐ అధికారులకు దేశ భద్రతకు సంబంధించిన సమాచారం చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. రెండు సార్లు పాకిస్థాన్ వెళ్లి అక్కడి అధికారులతో భేటీ కూడా అయినట్లు వెల్లడైంది. భద్రతా బలగాల కదలికలు, రక్షణశాఖ ప్రదేశాల సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. ఇదే విచారణలో గుజరాత్‌కు చెందిన రాజాకాభియా కుంభర్ ఏజెంట్‌గా పని చేస్తున్నట్లు తేలింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here