Ishan Kishan : ఇషాన్ రికార్డ్ డబుల్ సెంచరీ
NQ Staff - December 10, 2022 / 04:59 PM IST

Ishan Kishan : ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఏకంగా రికార్డు డబుల్ సెంచరీ సాధించాడు. భారత్ తరపున డబుల్ సెంచరీ సాధించిన నాలుగవ బ్యాట్స్మెన్ గా ఇషాన్ నిలిచాడు.
కేవలం 126 బాల్స్ ఆడిన ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు. ఇప్పటి వరకు క్రిస్ గేల్ 138 బాల్స్ లో డబుల్ సెంచరీ రికార్డు ఉంది. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు 9 డబల్ సెంచరీలు నమోదు కాగా అందులో భారత్ నుంచి నలుగురు ఉండడం అరుదైన విషయం.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ సాధించాడు. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ లు కూడా డబుల్ సెంచరీ సాధించిన వారి జాబితాలో ఉన్నారు.
ఇప్పుడు ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించు కున్నాడు. భవిష్యత్తు సూపర్ స్టార్ క్రికెటర్ గా ఇషాన్ ని క్రికెట్ అభిమానులు పిలుచుకుంటున్నారు. బంగ్లాదేశ్ గత రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించడంతో ఈ మ్యాచ్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని పట్టుదలతో టీమిండియా ఆడుతోంది.