రాధే శ్యామ్ లో టైటానిక్ సినిమాలో ఉన్న క్రేజీ సీన్ ని రిపీట్ చేస్తున్నారా ..?
Vedha - October 27, 2020 / 05:30 PM IST

పాన్ ఇండియన్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్ట్స్ కమిటవగా వాటిలో సొంత బ్యానర్ లో రూపొందుతున్న రాధే శ్యామ్ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ చేశాక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఒక పాన్ ఇండియా సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ కూడా సెట్స్ మీదకి వెళ్ళేందుకు సిద్దమవుతుంది.
కాగా ‘రాధేశ్యామ్’ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగొచ్చాక మిగతా సినిమా మొత్తం ఇక్కడే కంప్లీట్ చేయనున్నారట. ఇక రీసెంట్ గా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘రాధేశ్యామ్’ నుంచి చిత్ర బృందం మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో విడుదలైన ఈ మోషన్ పోస్టర్ ఫ్యాన్స్ ని బాగానే ఆకట్టుకున్నప్పటికి కంప్లీట్ యానిమేషన్ తో ఉండటం తో ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోకపోగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చేలా చేసింది. అయితే ఈ సినిమాలో ఒక షిప్ సీన్ ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ సీన్ ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించనున్నాడని అంటున్నారు. బాహుబలి కన్‌క్లూజన్ లో కూడా పెద్ద షిప్ లోనే ప్రభాస్ – అనుష్క ల మీద రాజమౌళి ఒక సాంగ్ ని తెరకెక్కించాడు. ఇక ప్రతీ ఒక్కరికి షిప్ సీన్ అంటే టైటానిక్ సినిమానే కళ్ళ ముందు కదలాడుతుంది. ఇప్పుడు రాధేశ్యామ్ లో ఉన్న ఈ షిప్ సీన్ ఏకంగా టైటానిక్ సినిమాలో ఉన్న షిప్ సీన్ నే మర్చిపోయోలా చేస్తుందని యూనిట్ భావిస్తున్నారట. చూడాలి ఈ సీన్ అభిమానులను ఎంత వరకు మెస్మరైజ్ చేస్తుందో.