తొందరపెడదామనే వాళ్ళు పవన్ కళ్యాణ్ ని కలిశారా ..?
Vedha - November 6, 2020 / 09:30 AM IST

గెలుపు ఓటమి.. హిట్ ఫ్లాప్స్ అన్నవి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయం మరోవైపు సినిమాల ని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నరన్న ప్రశంసలు అందుకుంటున్నారు. ఏదైనా ఒక పని చేస్తానని మాటిస్తే ఆ మాట కోసం ఎంతకైనా తెగించి.. సాహసించి పని చేస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారని అంటున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ సెట్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ముందు ఈ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఉదయం షూటింగ్ చేస్తూనే సాయంత్రం ఈ సినిమాకి డబ్బింగ్ పనులను కానిస్తున్నాడు.
ఈ నెలాఖరు వరకు వకీల్ సాబ్ సినిమాని కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అలాగే మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియం కూడా సెట్స్ మీదకి తీసుకు వచ్చి వీలైనంత త్వరగా సినిమాని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అలాగే షూటింగ్ స్పాట్ నుంచే జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలని చేసుకొస్తున్నట్టు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ స్పీడ్ చూసి ఖచ్చితంగా వచ్చే ఏడాది పవన్ నుంచి మూడు సినిమాలైనా రిలీజవుతాయని చెప్పుకుంటున్నారు.
అయితే ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ పర్సనల్ గా కలిసినట్టు తెలుస్తుంది. అందుకు కారణం ఆ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్నాడు. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండగా ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్దమైనదని సమాచారం. వాస్తవంగా వకీల్ సాబ్ తర్వాత క్రిష్ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత మైత్రీ వారు నిర్మించే సినిమా చేయాలి. కాని మధ్యలో మలయాళ రీమేక్ రావడంతో మైత్రి వాళ్ళ సినిమా డిలే అవుతుందేమో అని భావించారట.
అదీ కాక పవన్ కళ్యాణ్ జోరు మీద ఉన్నప్పుడే చక చకా పని కానిచ్చేస్తాడు. ఒకవేళ పూర్తి గా కొన్నాళ్ళు రాజకీయాలకి సంబంధించిన వ్యవహారాలలో తలమునకలవ్వాల్సి వస్తే ఎన్ని రోజులు మళ్ళీ సినిమాల వైపు చూడరో చెప్పలేము. అందుకే మైత్రీ వారు వీలైనంత త్వరగా తమ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని పవర్ స్టార్ ని రిక్వెస్ట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి పవర్ స్టార్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో.