Pragya jaiswal : ప్రగ్యా జైస్వాల్ నయనతార లాంటి రోల్ లో కనిపించబోతుందా..?

Pragya jaiswal : ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఇద్దరు భారీ హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం ఈ సినిమాకి హైలెట్ గా నిలవబోతోందని ఇప్పటికే రిలీజైన ఫస్ట్ రోర్ అండ్ టైటిల్ రోర్ తో అర్థమైపోయింది.

is pragya-jaiswal performing the role similar to nayanatara
is pragya-jaiswal performing the role similar to nayanatara

కాగా ఏప్రిల్ 13న యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడిన ఈ టీజర్ రికార్డు స్థాయి వ్యూస్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఊహించని విధంగా రోజు రోజుకి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కేవలం 17 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ‘అఖండ’ టీజర్ ‘బాహుబలి’ ‘ఆర్.ఆర్.ఆర్’ ‘సాహో’ లాంటి భారీ చిత్రాల రికార్డులను బ్రేక్ చేయడం సంచలనంగా మారింది. కాగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు.

Pragya jaiswal : ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తోంది.

ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన తాజా షెడ్యూల్ లో బాలకృష్ణ – ప్రగ్యా మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ని బాలయ్య సింహ సినిమాలో నయనతార తరహాలో చూపించబోతున్నాడట. కాగా తాజా షెడ్యూల్ కి ప్రగ్యా జైస్వాల్ ప్యాకప్ చెప్పినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కంచె స్థాయి హిట్ మళ్ళీ ఈ బ్యూటీకి దక్కలేదనే చెప్పాలి. అయితే బాలయ్య అఖండ సినిమాతో భారీ హిట్ అందుకుంటానన్న నమ్మకంతో ఉంది. చుడాలి మరి అఖండ సినిమాతో ఎలాంటి సక్సస్ అందుకుంటుందో. ఇక ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తోంది.

Advertisement