ఇటలీ లో జరుగుతున్న రాధే శ్యామ్ సెట్ నుంచి పూజా హెగ్డే ని పంపించేసిన యూనిట్ ..?
Vedha - November 4, 2020 / 10:00 AM IST

ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతుందట. కాగా ప్రభాస్ – పూజా హెగ్డే డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెల్సిందే. కాగా ఈ సినిమా ఇటీవలే 15 రోజుల షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళారు. అయితే అనుకున్న దానికంటే కాస్త స్లోగానే చిత్రీకరణ సాగుతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగి వచ్చి మిగతా షూటింగ్ మొత్తం సెట్స్ లో కంప్లీట్ చేయనున్నారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ మ్యాట్ సెట్స్ ని అలాగే భారీ హాస్పిటల్ సెట్ ని కూడా సిద్దం చేశారట.
ఇక తాజా సమాచారం ప్రకారం ఇటలీ నుంచి పూజా హెగ్డే ని చిత్ర బృందం పంపించేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు పూజా పాల్గొనాల్సిన షూటింగ్ కంప్లీటయిందట. అందుకే యూనిట్ అందరూ అక్కడే ఉన్నప్పటికి పూజా మాత్రం ఇండియాకి వచ్చేసిందట. బాలీవుడ్ సినిమాకి డేట్స్ ఇవ్వడంతో ప్రస్తుతం ముంబై కి చేరుకుందట.
మరో వారం రోజుల్లో ఇటలీలో అనుకున్న టాకీపార్ట్ కంప్లీట్ చేసుకొని ప్రభాస్ బృందం కూడా ఇండియాకి వచ్చేయనున్నారని సమాచారం. కాగా పూజా హెగ్డే రాధే శ్యామ్ తో పాటు అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.