మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ బొమ్మరిల్లు కి సీక్వెలా ..?
Vedha - November 1, 2020 / 06:30 PM IST

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. ఆ మూడు సినిమాలలో ఒక్క సినిమా కూడా భారీ హిట్ అందుకోలేదు. అయితే ఈ సారి మాత్రం హిట్ పక్కా అని ధీమాగా ఉన్నాడు అక్కినేని హీరో. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే అఖిల్ సరసన నటిస్తుంది.
ఇప్పటికే ఈ జంట మీద బాగా క్రేజ్ నెలకొంది. ఇక గతంలో పూజా నాగ చైతన్య తో నటించిన ఒక లైలా కోసం మంచి హిట్ ని అందుకుంది. ఆ సెంటిమెంట్ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. కాగా ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తుండగా గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ లిరికల్ ‘మనసా మనసా’ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి.
ఇక ఈ సినిమాలో ఉన్న లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని యూనిట్ నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమా సక్సస్ అఖిల్ తో పాటు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కి చాలా కీలకం. అయితే ఇప్పుడు ఈ సినిమా కి సంబంధించిన న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట. రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఆ టీజర్ చూసిన వాళ్ళు కాన్సెప్ట్ కాస్త అటు ఇటు గా బొమ్మరిల్లు సినిమా మాదిరిగా ఉందని మాట్లాడుకుంటున్నారట.
అంతేకాదు ఈ సినిమా బొమ్మరిల్లు కి సీక్వెల్ అయి ఉండొచ్చన్న టాక్ కూడా నడుస్తోందట. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వచ్చిన బొమ్మరిల్లు భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకుంది. అందుకే ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ కి అలాంటి కథ అయితే భారీ హిట్ దక్కుతుందనే ఇలా ప్లాన్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా జనాలకి బోర్ కొట్టకుండా అఖిల్ కి మంచి హిట్ దక్కితే చాలు అంటున్నారట అక్కినేని ఫ్యాన్స్.