Is Lokesh’s arrest inevitable? : లోకేష్ అరెస్ట్ తప్పదా.. మూల్యం చెల్లించుకోవాల్సిందేనా..?
NQ Staff - September 13, 2023 / 01:26 PM IST

Is Lokesh’s arrest inevitable? : ఏపీలో ఇప్పుడు రాజకీయాలు మంచి కాక మీద ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ కావడం టీడీపికి కోలుకోలేని దెబ్బ అనే చెప్పుకోవాలి. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు చంద్రబాబు ఒక్కసారి కూడా కేసుల్లో ఇరుక్కున్నది లేదు. జైలుకు వెళ్లింది లేదు. కనీసం కోర్టు మెట్లు ఎక్కింది లేదు. కానీ సరైన సాక్ష్యాలు దొరికే వరకు అందరూ దొరలే. దొరికితేనే అసలు బాగోతం బయట పడుతుంది అన్నట్టు ఉంది ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబుకు సీఐడీ సాక్ష్యాలతో రిమాండ్ పడేలా చేసింది.
అయితే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ ను తాను సీఎం అయిన రెండు నెలలకే అమలు పరిచారు. జర్మనీ కంపెనీ ఎలాంటి నిధులు విడుదల చేయకున్నా.. ప్రభుత్వ వాటాలో 10 శాతం కింత రూ.341 కోట్లు విడుదల చేయించారు. అనేక షెల్ కంపెనీల ద్వారా అటు తిరిగి ఇటు తిరిగి ఆ డబ్బు మొత్తం చంద్రబాబు వద్దకే చేరిందని సీఐడీ తన రిపోర్టులో వెల్లడించింది. అయితే కోర్టు ముందు సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో లోకేష్ పేరు కూడా ఉంది. ఇదే ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. పైగా సీఐడీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. లోకేష్ ను కూడా విచారించాల్సి ఉంటుందని తెలిపారు.
అంటే లోకేష్ అరెస్ట్ కూడా తప్పదని స్పష్టంగా అర్థం అవుతోంది. ఎందుకంటే ఈ స్కిల్ డెలవప్ మెంట్ కేసులో లోకేష్ కు కూడా సంబంధం ఉందని సీఐడీ చెబుతోంది. ఆయన మంత్రిగా ఉండి ఇందులో పాలు పంచుకున్నట్టు సీఐడీ చెబుతోంది. అంటే అక్టోబర్ నెలలో మరో అరెస్ట్ ఉండక తప్పేలా లేదు. చేసిన తప్పులకు శిక్ష పడక తప్పేలా లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయారు. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ మొత్తం డైలమాలో పడిపోయింది. పార్టీని నడిపించే సమర్థవంతమైన నేత లేకుండా పోయారు.
ఇదే ఇప్పుడు టీడీపీని కుదిపేస్తోంది. పైగా ఇప్పుడు లోకేష్ అరెస్ట్ కూడా ఉంటే ఇక పార్టీకి దిక్కే ఉండదు. చూస్తుంటే ఇప్పట్లో చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఈ లోగానే లోకేష్ కూడా అరెస్ట్ అయి జైలుకు వెళ్తే ఇక టీడీపీ సంగతి అంతే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలే ఎన్నికలు వస్తున్న సమయంలో ఎలా గెలవాలా అనే రచనలు చేయకుండా.. చంద్రబాబు, లోకేష్ ను ఎలా బయటకు తీసుకురావాలనే వ్యూహాల్లోనే టీడీపీ, నారా, నందమూరి కుటుంబం ఉండనుంది.
మొత్తానికి ఎన్నికలకు టీడీపీ వ్యూహాలు రచించే పరిస్థితి అయితే లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీ దిక్కులేని పరిస్థితుల్లో ఉండిపోవడం ఖాయం అని అంటున్నారు. మరి లోకేష్ ఎన్నికల్లో కీలక మైన నేతగా ఎదగాలని భావిస్తుంటే.. చివరకు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఎలాగైనా గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటే.. చివరకు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.