Chandrababu : చంద్రబాబు సభలు, ర్యాలీలపై నిషేదం సాధ్యమా?
NQ Staff - January 3, 2023 / 03:27 PM IST

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల పాల్గొన్న రెండు కార్యక్రమాల్లో కూడా తొక్కిసలాట జరిగి పెద్ద ఎత్తున ప్రాణా నష్టం జరగడంతో వైకాపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మీదట ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క సభలు సమావేశాలకు అనుమతించవద్దంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు ఎంత వారించినా కూడా తెలుగు దేశం పార్టీ నాయకులు వినకుండా ప్రాణ నష్టం కలిగే విధంగా సమావేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వైకాపా నాయకులు విమర్శిస్తున్నారు.
రాబోయే కొన్ని నెలల పాటు చంద్రబాబు నాయుడు యొక్క కార్యక్రమాలపై పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
జగన్ ప్రభుత్వం కనుక చంద్రబాబు నాయుడు సమావేశాలకు అనుమతించకుండా నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా తెలుగు దేశం పార్టీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది.
అప్పుడు న్యాయస్థానం లో తెలుగుదేశం పార్టీకి అనుకూల తీర్పు వచ్చే అవకాశం న్యాయ నిపుణులు ఉందని చెప్తున్నారు. కనుక వైకాపా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క సభలు సమావేశాలపై నిషేధం నిర్ణయం తీసుకోక పోవచ్చు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా అది సాధ్యం కాకపోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.