Etela Rajender : వాట్ నెక్స్ ట్… బీజేపీ వైపు ఈటల చూపు?

Etela Rajender : ఈటల రాజేందర్.. ఇప్పుడు తెలంగాణ మంత్రి కాదు. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే. ఇవాళ ఉదయమే ఓవైపు తనపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరుగుతుండగా… తెలంగాణ గవర్నర్ తమిళిసై… తన వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఇంత సడెన్ గా నిర్ణయాలు తీసుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. భూకబ్జాపై రైతులు లేఖ రాయడం, వెంటనే విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించడం, తెల్లారే ఈటల శాఖను సీఎం కేసీఆర్ తీసేసుకోవడం… ఇవన్నీ చూస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రకారం.. పక్కా ప్రణాళిక ప్రకారం… ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసిందని స్పష్టంగా అర్థం అవుతోంది. ఓవైపు రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారో లేదో.. మరోవైపు కొన్ని మీడియా చానెళ్లలో ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంపై కథనాలు ప్రసారం అయ్యాయి.

is etela rajender interested to join in bjp
is etela rajender interested to join in bjp

అవన్నీ కట్టుకథలని… తను ఏ తప్పు చేయలేదని ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినా… మరునాడే విచారణ జరుగుతుండగానే తన మంత్రిత్వ శాఖను సీఎం కేసీఆర్ కు అటాచ్ చేశారు. అయితే.. ప్రస్తుతానికి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కానీ.. మంత్రి పదవి లేదు. ఒకవేళ  ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతారా? టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారా? అనే విషయం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.

ఒకవేళ ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్తే తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి. అవి ఖచ్చితంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తర్వాత అంత బలమైన పార్టీ బీజేపీ మాత్రమే. కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు ప్రస్తుతం అంత సీన్ లేదు. ఆ పార్టీల్లో ఈటల లాంటి నాయకులు చేరరు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వస్తే ఈటలకు ఉన్న ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. బీజేపీకి ఈటల లాంటి నిఖార్సయిన నాయకుడు పార్టీలోకి వస్తే అది ప్లస్సే. కానీ.. టీఆర్ఎస్ పార్టీ అది ఎంతో నష్టం కలిగిస్తుంది. మరి.. సీఎం కేసీఆర్ మీద కోపంతో పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో ఈటల చేరుతారా? లేక సైలెంట్ గా కొన్ని రోజులు ఉంటారా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement