Irfan Pathan : టీ20 వరల్డ్ కప్ : పాక్ ప్రధానికి ఇర్ఫాన్ స్ట్రాంగ్ కౌంటర్
NQ Staff - November 13, 2022 / 11:07 AM IST

Irfan Pathan : టీ20 వరల్డ్ కప్ లో నేడు ఫైనల్ లో భాగంగా పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ జట్టులు తలపడబోతున్న విషయం తెలిసిందే. ఈ తుది పోరులో కచ్చితం గా ఇండియా నిలుస్తుందని అంతా భావించారు.
కానీ అనూహ్యంగా ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఘోర పరాజయం పాలవ్వడంతో పాకిస్తాన్ తో ఫైనల్లో తలపడే అవకాశం ఇంగ్లాండు కి దక్కింది. ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ మధ్య జరగబోతున్న ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసిన ట్వీట్ విమర్శల పాలయింది.
పాక్ ప్రధాని 152/0 వర్సెస్ 170/0 అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ను చాలా మంది పొగరు అన్నట్లుగా కామెంట్స్ చేశారు. ఈ సందర్భం గా పాకిస్తాన్ ప్రధాని చేసిన ట్వీట్ కి టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
మీకు మాకు ఇదే తేడా. మేము గెలిచినా ప్రత్యర్థి గెలిచిన సంతోషిస్తాం.. కానీ మీరు ప్రత్యర్థి ఓటమి తో రాక్షసానందాన్ని పొందుతారు. ఇకనైనా ఇలాంటి పరువు పోగొట్టుకునే పనులు మానుకోవాలి.
సొంత దేశంలో సమస్యలపై దృష్టి సారించాలంటూ పాకిస్తాన్ ప్రధానికి ఇర్ఫాన్ ఖాన్ సలహా ఇచ్చాడు. ఇర్ఫాన్ ట్వీట్ ఇండియా లో వైరల్ అవుతూ ఉండగా పాకిస్తాన్ లో కొందరు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. వీటికి పాకిస్తాన్ ప్రధాని ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.