ఐపీల్ స్పాన్సర్ షిప్ చిక్కుల్లో ‘డ్రీమ్ 11’

Advertisement

ఐపీల్ 2020 స్పాన్సర్ షిప్ గా డ్రీమ్ 11 సొంతం చేసుకుంది. అయితే వివో ఐపీల్ నుండి తప్పుకోగా, ఇక డ్రీమ్11 దక్కించుకోవడంతో ఓ భాద తప్పింది అనుకుంది బీసీసీఐ. ఇప్పటికే ఐపీల్ స్పాన్సర్ షిప్ కోసం చాలా కంపెనీలు పోటీ పడ్డాయి. దాంట్లో బైజూస్‌ (రూ. 201 కోట్లు), అన్‌ అకాడమీ (రూ. 170 కోట్లు),డ్రీమ్‌ 11(222 కోట్ల)తో పీతి పడ్డాయి. కానీ దాంట్లో అందరికంటే ఎక్కువగా డబ్బులు పెట్టి డ్రీమ్‌ 11 టైటిల్ స్పాన్సర్‌ షిప్ ను దక్కించుకుంది. అలాగే వచ్చే ఏడాది కూడా ‘వివో’ తిరిగి రాకపోతే ఆ స్పాన్సర్ షిప్ ను కూడా డ్రీమ్‌ ఎలెవన్‌కు అప్పగించనున్నారు.

అయితే తాజాగా టైటిల్ స్పాన్సర్ షిప్ డ్రీమ్11 పై పలు వివాదాలు వస్తున్నాయి. డ్రీమ్‌11లో కూడా చైనా సంస్థ ‘టెన్సెంట్‌’ పెట్టుబడులు ఉన్నాయి. ఈ కంపెనీలో కూడా చైనా పెట్టుబడులు ఉండడంతో డ్రీమ్‌11 ఐపీఎల్ స్పాన్సర్‌గా ఉండడాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ తాజా వివాదంపై బీసీసీఐ స్పందించింది. అయితే ఈ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు అందరు కూడా భారతీయులే అని స్పష్టం చేసింది. అలాగే చైనా వాటా కూడా చాలా తక్కువే అని తెలిపింది. అందుకోసమే ఆ వార్తలు పట్టించుకోవద్దు అని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here