రేపు విడుదల కానున్న ఐపీల్ షెడ్యూల్

Advertisement

ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో అసక్తిగా ఎదురు చేస్తున్న ఐపీల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఐపీల్ టీం ఆటగాళ్లు యూఏఈ చేరుకున్నారు. కరోనా కారణంగా ఇండియాలో ఐపీల్ ను నిర్వహించడం కష్టమని భావించిన బీసీసీఐ అధికారులు యూఏఈలో నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆటగాళ్లు ప్రాక్టీస్ ను ప్రారంభించారు.

సెప్టెంబర్ 19 నుండి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ ను రేపు బీసీసీఐ అధికారులు విడుదల చేయనున్నారు. ఐపీల్ మ్యాచ్ లు నవంబర్ 10 న మిగియనున్నాయి. అయితే ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో కొంతమంది కరోనా భారిన పడ్డ విషయం తెలిసిందే. ఈ కరోనా ఐపీల్ ను కనీసం వేరే దేశంలోనైనా సాగిణిస్తుందో, అడ్డుపడుతుందో వేచి చూడాలి. ఈ ఐపీల్ లో ఎవరు కప్ గెలుస్తారోనని ఇప్పటి నుండే బెట్టింగ్స్ ప్రారంభం అయ్యాయి. వందల కోట్ల బెట్టింగ్స్ ఐపీల్ మీద నడుస్తూ ఉంటాయి. ఈసారి కరోనా వల్ల ఎంత బెట్టింగ్ జరుగుతుందో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here