ఐపీల్ వచ్చేస్తుంది. ఎప్పుడంటే..!

Advertisement

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి జీవితం అయోమయంగా తయారయింది. ఇప్పటికే కరోనా వల్ల పెళ్లిళ్లు,విందులు,వినోదాలు అన్ని కూడా అడ్డకట్టు వేయాల్సి వచ్చింది. ఇక క్రికెట్ అభిమానులు మాత్రం తీవ్ర నిరుత్సాహంగా ఉన్నారు. ఈ ఏడాదిలో జరగవలసిన ఐపీల్ కోసం క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చేస్తున్నారు.కరోనా నేపథ్యంలో మన దేశంలో మ్యాచ్‌లను నిర్వహించలేని పరిస్థితులు నెలకొనడంతో యూఏఈ వేదికగా నిర్వహిస్తామని బీసీసీఐ ఇది వరకే ప్రకటించింది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఐపీఎల్ టోర్నీ ప్రారంభంపై అధికారిక ప్రకటన బయటకు వచ్చింది.అయితే సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు ఐపీల్ టోర్నీలు జరుగుతాయని ఐపీల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా ప్రకటించారు. అలాగే ఎన్ని టీమ్స్ ఆడుతాయో, ఎంతమంది ఆటగాళ్లు ఆడుతారో త్వరలో వివరణ ఇవ్వనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here