Kieron Pollard : ఐపీఎల్: ‘ఆట’కు గుడ్ బై చెప్పేసిన కీరన్ పోలార్డ్.!
NQ Staff - November 15, 2022 / 02:42 PM IST

Kieron Pollard : అంతర్జాతీయ క్రికెట్‌కి ఇప్పటికే గుడ్ బై చెప్పేసిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ కీరన్ పోలార్డ్, తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే, ఆటగాడిగా మాత్రమే రిటైర్మెంట్ తీసుకుంటున్నానంటూ కీరన్ పోలార్డ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
సుదీర్ఘకాలం పాటు ముంబై ఇండియన్స్ పట్టుకి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తనదైన గ్లామర్ అద్దాడు పోలార్డ్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ముంబై జట్టుకి కీరన్ పోలార్డ్ అత్యద్భుతమైన సేవలందించిన సంగతి తెలిసిందే.
నన్ను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు: పోలార్డ్
‘ఇకపై మైదానంలో ఆటగాడిగా కనిపించబోను. ఆ యాక్షన్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతాను. కానీ, బ్యాటింగ్ కోచ్‌గా ముంబై ఇండియన్ జట్టు తరఫున పని చేస్తాను. నాకిష్టమైన క్రికెట్‌కి ఈ రకంగా సేవ చేసే అవకాశం కలిగింది. జట్టు యాజమాన్యం నన్ను చాలా బాగా చూసుకుంది..’ అని పోలార్డ్ పేర్కొన్నాడు.
‘జట్టులోకి తొలుత నన్ను తీసుకున్నప్పుడే నన్ను కుటుంబ సభ్యుడిగా ముఖేష్, నీతా, ఆకాష్ అంబానీ భావించారు. దానికి కట్టుబడి వారు తనను చాలా బాగా చూసుకున్నారు..’