ఐపీఎల్ 2020లో ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన టాప్ 10 క్రికెటర్లు వీరే..!

Advertisement

ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ ఈ రోజు మొదలవ్వనుంది. ఇక ఈ రోజు ముంబై, చెన్నై జట్టులు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటె ఈ ఐపీఎల్ 2020 సీజన్ లో అత్యధికంగా డబ్బులు తీసుకుంటున్న టాప్ 10 పెయిడ్ క్రికెటర్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.

1) ఐపీఎల్ 2020 టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ జట్టు కెప్టెన్
విరాట్ కోహ్లీ అత్యధికంగా 17 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు.

2) కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టకు చెందిన ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్
15.50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు.

3) చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని, ముంబై ఇండియన్స్ కెప్టెన్
రోహిత్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్‌లకు ఒక్కొక్కరికి
ఆయా జట్లు 15 కోట్ల రూపాయలు ఇస్తున్నాయి.

4) సన్ ‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు 12.50
కోట్ల రూపాయలు ఇస్తుంది.

5) రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్
సునీల్ నరైన్‌, రాజస్థాన్ ప్లేయర్ బెన్ స్టోక్స్ లకు ఒక్కొక్కరికి ఆయా
జట్లు యాజమాన్యాలు 12.50 కోట్ల రూపాయలు ఇస్తున్నాయి.

6) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ‌కు ఆ
జట్టు యాజమాన్యం 11 కోట్ల రూపాయలు ఇస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here