చైనా కంపెనీ స్పాన్సర్ షిప్ ను నిషేదించని ఐపీల్ నిర్వాహకులు

Advertisement

ఢిల్లీ: ఇండియన్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీల్ వచ్చే నెల 19న యూఏఈలో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లకు కొత్త టైమింగ్ ను అనుసరిస్తున్నారు. ప్రతి మ్యాచ్ రాత్రి 7:30కి ప్రారంభం కానున్నాయి. అలాగే సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఐపీల్ నవంబర్ 10న ఫైనల్స్ జరగనున్నాయి. మొదటి సంగం మ్యాచ్ లకు ప్రేక్షకులు ఉండరు. కానీ తరువాత సగం మ్యాచ్ లకు 40% ప్రేక్షకులతో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఎనిమిది టీమ్స్ ఐపీల్ లో పాల్గొననుండగా, ప్రతి టీంలో 24 మంది ఆటగాళ్లు ఉంటారు. ఈ మ్యాచ్ లను యూఏఈలో దుబాయ్, అబూ దాబి, షార్జా లో జరగనున్నాయి.

అయితే ఇప్పుడు ఐపీల్ పై ఒక వివాదం మొదలైంది. కొన్ని చైనా అప్స్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిని బ్యాన్ చేసిన తరువాత ప్రధాని మోదీ వోకల్ ఫర్ లోకల్ అని ఒక నినాదం ఇచ్చి, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. దీనితో ప్రజలు చైనా వస్తువులను నిషేదించడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఐపీల్ ను స్పాన్సర్ చేస్తున్న వివో ను ఐపీల్ కౌన్సిల్ నిషేధించాలని ప్రజలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చైనా కంపెనీ మొబైల్ ను స్పాన్సర్ షిప్ నుండి తొలగించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ లీడర్ ఒమర్ అబ్దుల్లా కూడా డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఐపీల్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here