IPL : ఐపీఎల్ 2023: సామ్ కుర్రన్ ఆల్ టైమ్ రికార్డ్.!
NQ Staff - December 23, 2022 / 06:03 PM IST

IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే ముందుగా ఆటగాళ్ళ వేలం గుర్తుకొస్తుంటుంది. ఆ స్థాయిలో పందెం గుర్రాళ్ళ కోసం వెచ్చిస్తుంటాయి ఆయా జట్ల యాజమాన్యాలు. కోట్ల వర్షం కురుస్తుంది కొందరు ఆటగాళ్ళ మీద. స్వదేశీ ఆటగాళ్ళ కంటే విదేశీ ఆటగాళ్ళకు కాస్త క్రేజ్ ఎక్కువగా వుంటుంది ఈ విషయంలో.
అందునా, ఆల్ రౌండర్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే వచ్చే ఆ కిక్కే వేరు. 2023 సంవత్సరానికి సంబంధించి జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల కోసం వేలం షురూ అయ్యింది.
18.50 కోట్లు పలికిన సామ్ కుర్రన్..
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రన్ ఈసారి రికార్డు ధర పలికాడు. ఈ ఆల్ రౌండర్ ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో తనదైన గుర్తింపు సొంతం చేసుకున్న విషయం విదితమే. తన ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఎన్నో విజయాల్ని జట్టుకి అందించాడు.
ఈ నేపథ్యంలోనే పంజాబ్ జట్టు సామ్ కుర్రన్‌ని 18.50 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి సంబంధించి ఇదో సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు.