IPL 2022 : ఇప్పుడు ఐపీఎల్ స‌రికొత్త పేరుతో.. రంగంలోకి దిగిన టాటా..!

IPL 2022 : క్రికెట్ ప్రేక్ష‌కుల‌కి ఫుల్ కిక్ ఇచ్చే ఐపీఎల్ త్వ‌ర‌లో మ‌రో సీజ‌న్ జ‌రుపుకోనుంది. అయితే ఈ సారి ఐపీఎల్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌ర‌గ‌న‌నుంది. దీనికి స్పాన్స‌ర్‌షిష్‌లు కూడా మార‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఐపీఎల్ 2016 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది ‘వీవో’… అయితే 2020లో కొన్ని కారణాల వల్ల వీవో ప్లేస్‌లో ‘డ్రీమ్ 11’ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది.

IPL 2022 tata have replaced vivo as sponsor
IPL 2022 tata have replaced vivo as sponsor

అయితే వచ్చే సీజన్‌లో చైనా మొబైల్ కంపెనీ ‘వీవో’కి బదులుగా భారత దిగ్గజ కంపెనీ ‘టాటా’ ఐపీఎల్‌కి టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించబోతుంది.. ఇకపై వీవో ఐపీఎల్‌ ‘టాటా ఐపీఎల్’గా మారుతుంది…’ అంటూ తెలిపాడు ఐపీఎల్ ఛైర్మెన్ బ్రిజేష్ పటేల్..2008లో ఐపీఎల్ ఆరంగ్రేటం చేసినప్పుడు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది ‘డీఎల్‌ఎఫ్’ కంపెనీ. మొదట ఐపీఎల్ సీజన్‌ కోసం రూ.40 కోట్లు చెల్లించి, టైటిల్ స్పాన్సర్‌షిప్ దక్కించుకుంది…

కూల్‌ డ్రింక్ కంపెనీ ‘పెప్సీ’ ఐపీఎల్‌కి టైటిల్ స్పాన్సర్‌గా ఉంది. 2013,14 ఏడాదిలో రూ.80 కోట్లకు, 2015లో రూ.90 కోట్లకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ దక్కించుకుంది పెప్సీ.. 2016లో రూ.100 కోట్లకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ దక్కించుకున్న చైనా మొబైల్ కంపెనీ వీవో, ఆ తర్వాతి ఏడాది రూ.100 కోట్లు, 2018లో రూ.80 కోట్లు, 2019లో రూ.130 కోట్లు చెల్లించింది…

2020లో చైనా కంపెనీ ఉత్పత్తులపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో వీవో స్థానంలో ఆన్‌లైన్ బెట్టింగ్ కంపెనీ ‘డ్రీమ్ 11’ రూ.222 కోట్లకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ దక్కించుకుంది.. 2021లో ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ కోసం రూ.260 కోట్లు చెల్లించింది ‘వీవో’… ఈ ఏడాది వీవో స్థానంలో ‘టాటా’ టైటిల్ స్పాన్సర్‌గా రానుంది…

ఐపీఎల్ ప్రసారహక్కుల విక్రయం ద్వారా దాదాపు రూ.35 వేల కోట్లు, ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త జట్ల ద్వారా రూ.12 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని దక్కించుకున్న బీసీసీఐ, ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ద్వారా ‘టాటా’ నుంచి రూ.300 నుంచి రూ.350 కోట్ల దాకా పొందనుందని సమాచారం..