IPL2022 : ఐపీఎల్ రిటెన్ష‌న్ లిస్ట్ విడుద‌లైంది.. భారీ రేటుకి అమ్ముడైన జ‌డేజా, పంత్

IPL2022 : ఇటీవ‌ల ఐపీఎల్ సీజ‌న్ 2021 పూర్తి కాగా, ఇప్పుడు ఐపీఎల్ 2022 సీజన్ కోసం రిటైన్ చేసుకోనున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయ్ ఫ్రాంచైజీలు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి తమ అభిమాన క్రికెట్ సూపర్ స్టార్‌లు పాత జట్లతోనే ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్, ఇషాన్ కిషన్, సురేష్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్ వంటి క్రికెటర్లు మళ్లీ ఐపీఎల్ ప్లేయర్ల వేలం పూల్‌లోకి వెళ్లనున్నారు.

IPL 2022 auction predicted Player retention
IPL 2022 auction predicted Player retention

పంజాబ్ జట్టు నుంచి కేఎల్ రాహుల్ నిష్క్రమించాడు. మయాంక్ అగర్వాల్, యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై పంజాబ్ విశ్వాసం ఉంచింది. ఇద్దరు ఆటగాళ్లను ఫ్రాంచైజీ తన వద్దే ఉంచుకుంది. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోహ్లి, మాక్స్‌వెల్‌తో పాటు మహ్మద్ సిరాజ్‌ను ఉంచుకుంది.

IPL 2022 auction predicted Player retention 1
IPL 2022 auction predicted Player retention 1

చెన్నై సూపర్ కింగ్స్ – రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు), ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు), మొయిన్ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు)
కోల్‌కతా నైట్ రైడర్స్ – ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేష్ అయ్యర్ (రూ.8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ – కేన్ విలియమ్సన్ (రూ.14 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ.4 కోట్లు)
ముంబై ఇండియన్స్ – రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ.12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ.6 కోట్లు)
పంజాబ్ కింగ్స్ – మయాంక్ అగర్వాల్ (రూ.12 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – విరాట్ కోహ్లీ (రూ.15 కోట్లు), గ్లెన్ మాక్స్‌వెల్ (రూ.11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ.7 కోట్లు)
ఢిల్లీ క్యాపిటల్స్ – రిషబ్ పంత్ (రూ.16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ.9 కోట్లు), పృథ్వీ షా (7.5 కోట్లు), అన్రిచ్ నార్ట్జే (రూ. 6.5 కోట్లు)
రాజస్థాన్ రాయల్స్ – సంజు శాంసన్ (రూ.14 కోట్లు), జోస్ బట్లర్ (రూ.10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.4 కోట్లు)

ఐపీఎల్ 2022కి ముందు మెగా వేలం జరగనుంది. ఈసారి రెండు కొత్త జట్లు కూడా చేరనున్నాయి. ఒక్కో జట్టు మొత్తం 4 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అయ్యే ఖర్చు రూ. 42 కోట్లుగా ఉండాలని బీసీసీఐ పేర్కొంది.

వేలంలో ఒక జట్టు పర్స్ రూ. 90 కోట్లుగా ఉండనుంది. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లు ఈరోజు రిటైన్ చేసుకునేందుకు 4 మంది ఆటగాళ్ల పేర్లను సమర్పించాలి. అదే సమయంలో, రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ డిసెంబర్ 1 నుంచి 25 వరకు ఒక్కొక్కరు ముగ్గురు ఆటగాళ్లను చేర్చుకోవచ్చు.