ఐపీల్ టీమ్స్ లలో ఉన్న బలహీనతలు ఇవే..!

Advertisement

కరోనా దృష్ట్యా ప్రతిఒక్కరు కూడా ఇంటెర్టైన్మెంట్ లేక హల్లాడిపోయారు. ముఖ్యంగా ఈ ఏడాది సమ్మర్ లో జరగవలసిన ఐపీల్ మాత్రం చాలా మిస్ అయ్యారు క్రికెట్ అభిమానులు. ఇక ఐపీల్ ఆలస్యం అయిన ఎట్టకేలకు మన ముందుకు రాబోతుంది. ఇక ఈ ఏడాది ఐపీల్ టోర్నీని యూఏఈ లో నిర్వహించనున్నారు. అందుకు గాను అన్ని టీంలు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. మరి ఈ ఏడాది ఐపీల్ టీంలు ఎలా ఉన్నాయో, వాళ్ళ బలహీనతలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

సన్ రైజర్స్ హైదరాబాద్ :
సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో బ్యాటింగ్ లో అవకతవకలు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటె ఓపెనింగ్ బ్యాటింగ్ ఆకట్టుకున్న, మిడిల్ ఆర్డర్ సరిగా లేకపోవడంతో టీం బ్యాటింగ్ లో విఫలం చెందుతుంది. ఇక బౌలింగ్ లో సన్ రైజర్స్ కు మంచి పట్టు ఉంది అని చెప్పాలి. భువనేశ్వర్ కుమార్ చాలా రోజుల తరువాత ఎంట్రీ ఇస్తుండడంతో ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. అలాగే సిద్దార్ట్ కౌల్ కొన్ని సందర్భాల్లో తాను చేస్తున్న మిస్టేక్స్ ను సరిదిద్దుకుంటే మంచిది.

కింగ్స్ ఎలేవేల్ పంజాబ్ :
పంజాబ్ టీం స్పిన్ బౌలింగ్ కు పెట్టింది పేరు. పంజాబీ బౌలింగ్ ఆర్డర్ బాగుందని చెప్పాలి. అలాగే సామీ, జోర్డాన్, అశ్విన్, ముజీబ్ వంటి కట్టడి చేయగలిగే బౌలింగ్ ఉంది. ఇక బ్యాటింగ్ లో కూడా మంచి లైన్ అప్ ఉంది. ముఖ్యంగా కేఎల్ రాహులు, క్రిస్ గైల్, మాక్స్ వెల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు.

రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ :
బెంగుళూర్ టీంలో గత ఐపిఎల్ సీజన్లలో నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ ఎంపికలు లేకపోవడం మరియు డేల్ స్టెయిన్, ఇసురు ఉడానా మరియు క్రిస్ మోరిస్‌లను చేర్చుకోకవడంతో టీంకు మైనస్ అని చెప్పాలి. అలాగే నాణ్యమైన భారతీయ సీమర్ లేకపోవడం మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఇక బ్యాటింగ్ మాత్రం పటిష్టంగా ఉంది. ముఖ్యంగా ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, మరియు ఎబి డివిలియర్స్ మరియు మొయిన్ అలీ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండడం టీం కు బలంగా మారనుంది.

రాజస్థాన్ రాయల్స్ :
రాజస్థాన్ టీంలో ఎక్కువగా విదేశీ ఆటగాళ్లు ఉండడంతో టీం కు మైనస్ పాయింట్ అని చెప్పాలి. ముఖ్యంగా జోస్ బట్లర్, కెప్టెన్ స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్ మరియు జోఫ్రా ఆర్చర్లలోని అందరు కూడా విదేశీ ఆటగాళ్లు. ఇక భారత ఆటగాళ్లలో సంజు సామ్సన్ మరియు రాబిన్ ఉత్తప్పలను మినహాయించి, యశస్వి జైస్వాల్ ఐపిఎల్ స్థాయిలో ఎక్కువగా అవగాహనా లేదని చెప్పాలి. ఇక బౌలింగ్ విషయానికి వెళితే జోఫ్రా ఆర్చర్, అండర్ కట్, వరుణ్ ఆరోన్ వంటి బౌలింగుతో పర్వాలేదు అని చెప్పాలి.

ఢిల్లీ క్యాపిటల్స్ :
ఢిల్లీ టీంలో ఎక్కువగా యువ ఆటగాళ్లు మరియు అద్భుతమైన బ్యాటింగ్ లైన్ అప్ తో రాబోయే రోజుల్లో మంచి టీం గా ఎదుగుతుంది అని చెప్పాలి. టాప్ ఆర్డర్ లో పృథ్వీ షా, అజింక్య రహానె, శిఖర్ ధావన్ లాంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉండడంతో టీంకు కలసిసొచ్చే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ లో కూడా రబడా వంటి మంచి బౌలర్లు ఉన్నారు.

కోల్ కత్తా నైట్ రైడర్స్ :
కోల్ కత్తా టీంలో టామ్ బాంటన్, శుభమన్ గిల్, నితీష్ రానా, దినేష్ కార్తీక్, ఎయోన్ మోర్గాన్ మరియు ఆండ్రీ రస్సెల్లతో ప్రతి బాల్ సిక్స్ కు పంపించడం ఖాయం అని చెప్పాలి. రస్సెల్, మోర్గాన్, నరైన్ మరియు కమ్మిన్స్ మంచి బౌలింగ్ అని చెప్పాలి. గతంలో పలు సీజన్లలో ఈ టీం మంచి ప్రతిభను కనబరిచింది.

చెన్నై సూపర్ కింగ్స్ :
ఇక చెన్నై జట్టుకు ఎమ్మెస్ ధోని లాంటి కెప్టెన్ ఉన్నారు కనుక ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇక గత సీజన్ల కంటే ఈ సీజన్లో ధోని పోరాడాల్సి ఉంటుంది. ఎందుకంటె సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు ఈ సీజన్ నుండి తప్పుకున్నారు. అలాగే బ్యాటింగ్ లో మంచి లైన్ అప్ ఉంది. ఇక బౌలింగ్ కూడా దీపక్ చాహర్, లుంగీ వంటి వారు ఉండడంతో టీం కి కలిసొచ్చే అవకాశం ఉంది.

ముంబై ఇండియన్స్ :
ముంబై జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ గా నిలిచింది. అయితే ఈ టీం కు స్పిన్ బౌలింగ్ కొరత ఎక్కువగా ఉంది. ఈ టీం ఈ ఒక్క కొరత నుండి బయట పడీతే టీం దూసుకుపోవడం ఖాయం. అయితే క్రునాల్ పాండ్య, రాహుల్ చాహర్ తప్ప ఈ టీంలో స్పిన్నర్లు లేరు. అలాగే మలింగా వంటి ఫాస్ట్ బౌలర్ లేకపోవడంతో టీంకు మైనస్ పాయింటే అని చెప్పాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here