నేడే ఐపీల్ షురూ.. జోష్ మీద ఉన్న క్రికెట్ ఫాన్స్

Advertisement

ఈ ఏడాది కరోనా కారణంగా వినోదాలు చాలా మిస్ అయ్యాం. ముఖ్యంగా ఈ ఏడాది సమ్మర్ లో జరగవలసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు కూడా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు క్రికెట్ ఐపీల్ ఈ రోజు నుండి మొదలు కానుంది. కరోనా దృష్ట్యా ఈ సీజన్ యూఏఈ లో నిర్వహిస్తున్నారు. ఇక ఐపీల్ కోసం క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురుచేస్తునారు. ఇక ఈ రోజు ఐపీల్ మొదలు అవుతుండడంతో తెగ సంబరపడిపోతున్నారు. అయితే మొదటి మ్యాచ్ చెన్నై, ముంబై జట్లు తలపడనున్నాయి.

రెండు జట్టులు కూడా మంచి పటిష్టమైన జట్లు. మరి ఈరోజు మొదటి మ్యాచ్ ఎవరు గెలుస్తారో అని ప్రేక్షక దేవుళ్ళు ఆసక్తికరంగా వేచిచూస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ముంబై, చెన్నై జట్లు ఆడిన మ్యాచుల వివరాలు చూసినట్లయితే.. ఈ రెండు జట్లు మొత్తం 28 సార్లు తలపడ్డాయి. దాంట్లో ముంబై 17 మ్యాచ్ ‌ల్లో గెలిచింది. అలాగే చెన్నై 11 మ్యాచ్ ‌లలో విజయం సాధించింది. ఇక ఈ లెక్క చూస్తే ముంబై ఇండియన్స్ కే ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే చెన్నై లో కీలక ప్లేయర్స్ లేకపోవడం కూడా జట్టుకు కాస్త నిరాశే అని చెప్పాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here