ఐపీఎల్ : ఆ విషయం మరిచిపో.. గార్గ్ ను క్షమించిన విలియమ్సన్

Admin - October 3, 2020 / 06:50 AM IST

ఐపీఎల్ : ఆ విషయం మరిచిపో.. గార్గ్ ను క్షమించిన విలియమ్సన్

ఐపీఎల్ 2020 క్రేజీగా సాగుతుంది. ప్రతి మ్యాచ్ కూడా థ్రిల్లింగ్ గా ఉత్సాహాన్ని నింపుతుంది. ఇదే తరహాలో నిన్న చెన్నై, హైదరాబాద్ టీంల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరులో ఊహించని విధంగా రైజర్స్ సత్తా చాటారు. అయితే రైజర్స్ గెలుపుకు కారణం యంగ్ ప్లేయర్సే అని చెప్పాలి. దాంట్లో ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ప్రియమ్ గార్గ్ పై.. లక్ష్మణ్, వార్నర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గార్గ్ భారీ షాట్లు ఆడలేని భావించినా.. అందుకు విరుద్ధంగా 26 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్‌ గా నిలిచాడు. అలాగే మరో యంగ్ ప్లేయర్ అభిషేక్ 24 బంతుల్లో 31 రన్స్ చేయడంతో సన్ ‌రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి 164 రన్స్ సాధించారు.

అయితే గార్గ్ వల్ల కెన్ విలియమ్సన్ రన్ అవుట్ అవుతాడు. అందుకుగాను విలియమ్సన్ గార్గ్ పై కాస్త కోపంగా చూస్తాడు. కానీ ప్రియమ్ గార్గ్ అద్భుత బ్యాటింగ్‌ తో సన్‌రైజర్స్‌కు మెరుగైన స్కోరు అందించాడు. ఇక గార్గ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే.. లక్ష్మణ్, వార్నర్ సహా.. సన్‌రైజర్స్ టీమ్ మొత్తం లేచి చప్పట్లు కొట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో సన్ ‌రైజర్స్ విజయం సాధించిన తరువాత విలియమ్సన్ మనసు కాస్త తేలిక పడింది. అయితే విలియమ్సన్ రనౌట్ కావడం తన తప్పేనని గార్గ్ ఒప్పుకున్నాడు. ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ డగౌట్ చేరగానే గార్గ్.. విలియమ్సన్ ‌కు సారీ చెప్పాడు. అందుకు ‘ఫర్వాలేదు.. ఆ విషయం మర్చిపో మేట్’ అంటూ విలియమ్సన్ గార్గ్ కు తెలిపాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us