IPL-14 Match-24 : ‘రాజస్థాన్’కి క్వింటన్ డీకాక్ షాక్

IPL-14 Match-24: ఢిల్లీలో ఈరోజు గురువారం మధ్యాహ్నం జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లోని 24వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్.. రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించారు. మరో 9 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 172 రన్నులు చేసి నెగ్గారు. ముంబై వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ ఒంటరి పోరాటం చేసి టీమ్ కి విక్టరీని అందించాడు. 50 బాల్స్ కే 70 రన్నులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ముంబై ఇండియన్స్ కి కూడా శుభారంభమే లభించింది. 49 రన్నుల వరకు వికెట్ పడలేదు. జట్టు స్కోర్ 49 వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ 14 పరుగులకి ఔట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 16 రన్నులు, కృనాల్ పాండ్య 39 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 2 వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1 వికెట్ తీశారు.

రెండూ.. రెండే..

ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్.. ఈ రెండు జట్లదీ ఒకటే పరిస్థితి. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడి రెండు మాత్రమే నెగ్గాయి. కాకపోతే రన్ రేట్ కాస్త ఎక్కువ ఉండటంతో ముంబై.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఈ రెండూ తలపడ్డాయి. టాస్ గెలిచిన ముంబై ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ జట్టులోని జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు.

మంచి టార్గెట్టే..

మొత్తం(20) ఓవర్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 171 రన్నులు చేసింది. తద్వారా ముంబై ముందు మంచి లక్ష్యమే(172 పరుగులు) పెట్టింది. గెలుపు అవకాశాలను ఫిప్టీ-ఫిఫ్టీగా ఉంచుకుంది. ఓపెనర్లు శుభారంభం చేశారు. 66 రన్నుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా నిలదొక్కుకున్నారు. ఔటైన నలుగురూ రెండంకెల స్కోర్ చేయటం గమనార్హం. జోస్ బట్లర్ 41, జైశ్వాల్ 32, కెప్టెన్ శాంసన్ 42, శివం దూబే 35 పరుగులు సాధించారు. మిల్లర్ 7, రియాన్ పరాగ్ 8 రన్నులతో నాటౌట్ గా నిలిచారు. ముంబై బౌలర్లలో రాహుల్ ఛాహర్ 2, బౌల్ట్, బుమ్రా ఒక్కో వికెట్ చొప్పున నేలకూల్చారు.

Advertisement