YS Jagan : జగనన్న మార్క్ పాలన.. ఒకే ఏడాదిలో 3.32లక్షల కోట్ల పెట్టుబడులు..!

NQ Staff - November 29, 2023 / 06:42 PM IST

YS Jagan : జగనన్న మార్క్ పాలన.. ఒకే ఏడాదిలో 3.32లక్షల కోట్ల పెట్టుబడులు..!

YS Jagan :

సమర్థవంతుడు సీఎంగా ఉంటే ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఇప్పుడు ఏపీలో జగనన్న హయాంలో పెట్టుబడుల జాతర కొనసాగుతోంది. గతంలో చంద్రబాబు హయాంలో అక్రమ వ్యాపారాలు నడిస్తే… ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మాత్రం పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం 2022-23లో ప్రభుత్వం రూ.3,32,186 కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి.

2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి రూ.9,41,020 కోట్లను ఆకర్షించిందని ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డీఎస్ రావత్ తెలిపారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 1,34,419 కోట్ల పెట్టుబడి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. దాంతో పాటు 27,110 కోట్ల విలువైన పెండింగ్ ప్రాజెక్టులను పునరుద్దరించినట్టు తెలిపింది. 2022-23లో మొత్తం పెట్టుబడి ప్రాజెక్టుల విలువ రూ.17,90,533 కోట్లు కాగా, అమలులో ఉన్న ప్రాజెక్టుల విలువ రూ.7,51,980 కోట్లు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెట్టుబడి ప్రాజెక్టులు 23,293 కోట్లు. కాగా ఇందులో ప్రైవేట్ రంగంలో 3,08,893 కోట్లు ఉండగా.. ప్రభుత్వ ప్రాజెక్టుల కింద 2022-23లో మొత్తం పెట్టుబడి ప్రాజెక్టులు రూ.10,65,526 కోట్లు. అమలులో ఉన్నవి రూ.5,64,868 కోట్లు. ఇదే ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగంలో మొత్తం పెట్టుబడుల ప్రాజెక్టులు రూ.7,25,006 కోట్లు బకాయి పడ్డాయని, రూ.1,87,112 కోట్లు అమలులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61 వేల ఎంఎస్ఎంఈలు ఉండగా, 5.80 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇలా రాష్ట్రంలో అన్ని విధాలుగా ఆదాయాన్ని సమకూరుస్తున్నారు సీఎం జగన్.

రాష్ట్రంలో అసలు ఏ పెట్టుబడులు రాలేవు అని చెబుతున్న వారికి ఇదో పెద్ద జవాబు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈ ఏడాదిలోనే అత్యధిక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. జగన్ పాలనలో ఇలా పెట్టుబడులు వస్తుంటే కొన్ని ఎల్లో మీడియాలు మాత్రం అసలు రాష్ట్రం నుంచి అన్నీ తరలిపోతున్నాయంటూ ప్రచారం చేస్తున్నాయి.

కానీ ఇది జగన్ చేసిన సర్వే కాదు కదా. ఒక జాతీయ సంస్థలు చేసిన సర్వేలోనే జగన్ పాలన భేష్‌ గా ఉందని తేలిపోయింది. ఇంతకంటే ఇంకేం సమాధానం కావాలి ప్రతిపక్షాలకు అని అంటున్నారు ఏపీ ప్రజలు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us