Hyper aadi: హైప‌ర్ ఆది నిజ‌స్వ‌రూపం ఇది…ఏడ్చుకుంటూ చెప్పిన రైజింగ్ రాజు

Hyper aadi: జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది కమెడియన్లు సత్తా చూపిస్తున్నారు. కేవలం ఆ షో నుంచే పాపులర్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ నుండి పాపుల‌ర్ అయిన కంటెస్టెంట్స్ అయిన వాళ్లు సినిమా ఆఫ‌ర్స్ కూడా పొందుతున్నారు. అయితే ఆ మధ్య కొన్ని నెలల పాటు ఓ టీమ్ లీడర్ మాత్రం జబర్దస్త్‌లో కనిపించలేదు. హైపర్ ఆదితో పాటు మరో టీమ్ లీడర్ రైజింగ్ రాజు ఉంటాడు.. ఆయన మాత్రం అప్పట్లో ఆర్నెళ్ల పాటు జబర్దస్త్‌లో మాయం అయ్యాడు.
interesting fascts about hyper aadi2
interesting fascts about hyper aadi2

రాజు లేకుండానే దొరబాబు, పరదేశీ లాంటి వాళ్ళతోనే స్కిట్స్ చేసాడు ఆది. రైజింగ్ రాజు ఉన్నా లేకపోయినా హైపర్ ఆది స్కిట్స్‌లో ఫన్ మాత్రం తగ్గదు. ఎవరున్నా లేకపోయినా కేవలం పంచులతోనే పిచ్చెక్కిస్తుంటాడు ఆది. అయితే రైజింగ్ రాజు ఉంటే ఆయన వయసుపై ఇంకా మూడు నాలుగు పంచులు ఎక్కువ వేసి నవ్విస్తుంటాడు.

interesting fascts about hyper aadi1
interesting fascts about hyper aadi1

నిజానికి హైపర్ ఆదితో పాటు రైజింగ్ రాజు కూడా టీమ్ లీడర్ అని చెప్తుంటారు కానీ చాలా మందికి కనీసం ఈ విషయం గుర్తు కూడా లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఆది అతన్ని డామినేట్ చేస్తున్నాడు కాబట్టి. హైపర్ ఆది, రైజింగ్ రాజు అంటూ పేరుకు మాత్రమే ఉంటుంది కానీ పేమెంట్స్ నుంచి అన్నీ చూసుకునేది ఆది మాత్రమే.

interesting fascts about hyper aadi3
interesting fascts about hyper aadi3

డైలాగ్స్, స్కిట్స్ అన్నీ రాసేది కూడా ఆదే. అందుకే ఇద్దరు పేర్లు టీం లీడర్ కింద కనిపించినా కూడా అక్కడ హైపర్ ఆది సోలో పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఆ మధ్య కరోనా సమయంలో సీనియర్ కమెడియన్ రాజు కనిపించలేదు. దాంతో ఆయన మానేసాడా లేదంటే కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడా అనేది చాలా రోజుల పాటు ఎవరికీ అర్థం కాలేదు.

ఆర్నెళ్ళ తర్వాత రాజు వచ్చాడు. మళ్లీ ఇప్పుడు ఎప్పట్లాగే కలిసి స్కిట్స్ చేసుకుంటున్నారు. మరి అప్పుడు రాజు ఎందుకు మానేసాడనే విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కరోనా సమయంలోనే తనకు మనవరాలు పుట్టిందని.. ఆ సమయంలో తాను బయటికి వెళ్తే పాపకు లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని భయపడి ఇంట్లోనే ఉండిపోయానని చెప్పాడు రాజు.

interesting fascts about hyper aadi
interesting fascts about hyper aadi

ఆ సమయంలో ప్రతీనెల తనకు ఇంటికి పేమెంట్ పంపించాడని హైపర్ ఆది గురించి ఆసక్తికరమైన నిజాలు బయటపెట్టాడు. కాళ్ళు మొక్కుదాం అంటే వయసులో చిన్నోడు అయిపోయాడు.. నిజంగా హైపర్ ఆది దేవుడు అంటున్నాడు రాజు. తాను చేసినా చేయకపోయినా కూడా పేమెంట్ మాత్రం సరైన టైమ్‌కు ఇస్తుంటాడని చెప్పుకొచ్చాడు. తాను బ్రేక్ తీసుకున్నపుడు హైపర్ ఆదిపై కొందరు విమర్శలు చేసారని.. అయినా కూడా నవ్వుతూ వాటిని స్వీకరించాడని తెలిపాడు రాజు.