Jabardasth Show : జబర్దస్త్ ఒక్కో ఎపిసోడ్ కు ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
NQ Staff - March 3, 2023 / 03:30 PM IST

Jabardasth Show : ఇప్పుడు బుల్లితెరపై క్వీన్ అయిపోయింది ఇంద్రజ. ఒకప్పుడు హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. అప్పట్లో చాలా పాపులర్ అయిపోయింది. ఎన్నో సినిమాల్లో తన అందంతోనే కుర్రాళ్లను ఊపేసింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది.
దాంతో పాటు అటు సినిమాల్లో కూడా వరుసగా కీలక పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కామెడీ ప్రోగ్రామ్ అయిన జబర్దస్త్ ఇప్పుడు ఆమె చేతిలో ఉంది. మొదట్లో ఈ షోకు జడ్జిగా చేసిన రోజా , నాగబాబు షోను ఓ రేంజ్ కు తీసుకెళ్లారు. కానీ వారు వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నారు.
జడ్జిగా సక్సెస్..
వారిద్దరూ తప్పుకున్న తర్వాత చాలామంది ఈ షోకు జడ్జిలుగా చేశారు. అదే సమయంలో అటు శ్రీదేవి డ్రామా కంపెనీతో బుల్లితెరపైకి అడుగు పెట్టింది ఇంద్రజ. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆమె జడ్జిగా సక్సెస్ కావడంతో ఆమెనే జబర్దస్త్ లోకి తీసుకు వచ్చారు. రోజా స్థానంలోకి వచ్చిన ఆమె.. అటు నాగబాబు స్థానంలో వచ్చిన కృష్ణ భగవాన్ బాగానే అలరిస్తున్నారు.
అయితే ఇంద్రజకు ఒక్కో ఎపిసోడ్ కు రూ.2.5లక్షలు ఇస్తున్నారంట. అటు కమెడియన్ కృష్ణ భగవాన్ కు కూడా ఒక్కో ఎపిసోడ్ కు రూ.2.5లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అంతకు ముందు చేసిన రోజాకు రూ.5లక్షలు ఇస్తే.. నాగబాబుకు రూ.3లక్షలు ఇచ్చారు. కానీ వీరికి మాత్రం కాస్త తక్కువగానే ఇస్తున్నారని చెప్పుకోవాలి.