Indian Telecom Sector : మొబైల్ వినియోగదారులపై మరింత బాదుడు తప్పదా?
NQ Staff - December 27, 2022 / 10:34 AM IST

Indian Telecom Sector : ఇండియన్ టెలికాం రంగం అభివృద్ధిలో దూసుకు పోతోంది. పది సంవత్సరాల తో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది. అన్ని టెలికాం సంస్థలు కూడా 4g సేవలను అందిస్తున్నాయి.
4g అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారుల సంఖ్య అమాంతం పెరిగి పోయింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల యొక్క వినియోగం ఎక్కువగా పెరిగి పోవడంతో ఆయా సంస్థలు కూడా తక్కువ రేటుకు డేటా ఇస్తున్నామని చెబుతూనే వినియోగదారులపై భారీగా భారాన్ని మోపుతున్నాయి.
నెల నెల మినిమం గా 200 నుండి 300 రూపాయల రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇండియాలో ఇప్పటికే పలు టెలికాం సంస్థలు 5జి నెట్వర్క్ సేవలను ప్రారంభించడం జరిగింది.
ప్రస్తుతానికి మెట్రో నగరాలకే పరిమితమైన 5జి సేవలు అతి త్వరలోనే దేశం మొత్తం విస్తరించే అవకాశాలు ఉన్నాయి, 5జి సేవలు ప్రారంభం అయితే వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.
భారీ ఎత్తున 5జి సేవలను అందించడంతో పాటు పెద్ద మొత్తంలో వినియోగదారుల నుండి చార్జీలు వసూలు చేసేందుకు కంపెనీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 5g సేవలు మొదలయితే 400 నుండి 500 నెల వారీ రెంటల్ ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. ఒకప్పుడు ఇన్కమింగ్ ఉచితంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇన్కమింగ్ కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.