ప్రపంచంలోనే భారత ఆర్మీ ఉత్తమమైనది: ఆర్మీ చీఫ్

Advertisement

చైనా-భారత్ మధ్య ఇంకా సరిహద్దు గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా సైనిక బలగం కూడా పాకిస్థాన్ లా చేసుకున్న ఒప్పందాలను నిత్యం ఉల్లంఘిస్తూ ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాతవరణం పై ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ వివరణ ఇచ్చారు. సరిహద్దులో ఇంకా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, దేశ భద్రత కోసం సైనిక బలగాలను మోహరించామని తెలిపారు. ఈశాన్య లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు సమీపంలో చైనా దురాక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ గురువారం నుంచి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.

ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఎదుర్కుందుకు సిద్ధంగా ఉన్నామని, భారత ఆర్మీ ప్రపంచంలోనే ఉత్తమమైనదని మనోజ్ వెల్లడించారు. డ్రాగన్‌తో చర్చలు చేపట్టి సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. వాస్తవాధీనరేఖ వెంట పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నట్లు, వాటికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సరిహద్దులో జరుగుతున్న గొడవల కారణంగా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఇప్పటికే చైనాకు చెందిన పలు యాప్స్ ను ఇండియాలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here