Telangana Elections 2023 : సీఎం పదవిపై రేవంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు.. ఇది కదా నాయకుడి లక్షణం..!

NQ Staff - December 2, 2023 / 12:44 PM IST

Telangana Elections 2023 : సీఎం పదవిపై రేవంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు.. ఇది కదా నాయకుడి లక్షణం..!

Telangana Elections 2023 :

తెలంగాణలో అధికారం ఎవరిది అనే ప్రశ్నలకు చాలానే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో అధికారం ఎవరిది అనేది తేలిపోనుంది. ఇలాంటి తరుణంలో పోలింగ్ పూర్తయిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ సంచలనం రేపతున్నాయి. వాస్తవానికి మూడోసారి అధికారం బీఆర్ ఎస్ పార్టీదే అని అంతా అనుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసేశాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ కు మొగ్గు చూపించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పేస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే బీఆర్ ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అసలు ఎవరు సీఎం అవుతారనే ప్రశ్నలు అందరినీ చుట్టు ముడుతున్నాయి. ఎందుకంటే సీఎం పదవి కోసం చాలామంది కాంగ్రెస్ లో పోటీ పడుతున్నారు. అందులో రేవంత్ సహా భట్టి విక్రమార్క, జానారెడ్డి, జగ్గారెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రాజనర్సింహా ఇలా చాలామంది ఉన్నారు. అయితే అందరికంటే ఎక్కువగా రేవంత్ పేరే బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ కు గ్రాఫ్ పెంచారు. అన్ని నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ క్రమంలోనే ఆయన సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెండు సార్లు స్పందించిన ఆయన.. ఇప్పుడు మూడోసారి కూడా దానిపై స్పందించారు. తాజాగా ఆయన ఇండియాటుడే మీడియా సంస్థతో మాట్లాడారు. నా అంచనా ప్రకారం కాంగ్రెస్ కు 80 సీట్లకు మించి రాబోతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం BRS పార్టీకి 34-44 సీట్లు పొందవచ్చని, కాంగ్రెస్ 63-73 సీట్లతో తెలంగాణ థ్రిల్లర్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. అంచనా వేసిన ఓట్ల శాతం ప్రకారం, కాంగ్రెస్‌కు 42 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేయగా, బీఆర్‌ఎస్‌కు 36 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

ఇదే క్రమంలో సీఎం పదవి కోసం భట్టి విక్రమార్క కూడా పోటీ పడుతున్నారు కదా అని రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రశ్నించారు. దానికి రేవంత్ స్పందిస్తూ.. రేపు కాంగ్రెస్ తరఫున గెలిచే ప్రతి ఎమ్మెల్యే కూడా సీఎం అభ్యర్థే అని ప్రకటించారు. పార్టీ ఎవరిని సీఎం చేస్తే అతనే అవుతారని అన్నారు.

India Today Release Polls In Telangana Elections 2023

India Today Release Polls In Telangana Elections 2023

నేను ఎన్నడూ పదవులు కోరుకోలేదు. కేవలం ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాను. గతంలో నాకు వైఎస్సార్, కేసీఆర్ ఎన్నో పదవులు ఆఫర్ చేశారు. కానీ నేను అవన్నీ రిజెక్ట్ చేశాను. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉన్నానని గుర్తు చేశారు. సీఎం పోస్ట్ విషయంలో హై కమాండ్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. దాంతో రేవంత్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి నాయకత్వ లక్షణాలు లీడర్ కు ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే తాను సీఎం అవుతానని చెప్పకుండా.. హై కమాండ్, పార్టీ చెప్పిన వారే అవుతారని చెప్పడం ఇక్కడ విశేషం.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us