IND-PAK: 10 సెక‌న్ల యాడ్‌కి 30 ల‌క్ష‌లా.. అత్యంత ఖరీదైన రేటుగా వ‌ర్ణిస్తున్న విశ్లేష‌కులు

IND-PAK ఇండియా – పాకిస్తాన్ జట్లు ఇవాళ రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీ20 వరల్డ్ కప్ 2021లో తొలి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇరు జట్ల మధ్య జరుగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. దీంతో పాటు డిస్నీ + హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో సబ్‌స్క్రిప్షన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

TheNewsQube-

ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌పై ఉన్న అంచనాల నేపధ్యంలో గేమ్ మ‌ధ్య‌లో ప్ర‌సారం కానున్న 10 సెక‌న్ల యాడ్ కోసం 25-30ల‌క్ష‌లు చెల్లించ‌నున్నార‌ట‌. భారతీయ టెలివిజన్‌లో ఇప్పటివరకు ప్రసారం చేయబడిన ఏ క్రీడా ఈవెంట్‌కైనా ఇది అత్యంత ఖరీదైన రేటు అని అంటున్నారు.

సుదీర్ఘకాలం తరువాత రెండు దేశాల మధ్య జరగనున్న మ్యాచ్ కోసం క్రీడా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో అసలు ఇండియా పాకిస్తాన్‌లలో ఏ జట్టుది పైచేయిగా ఉంది. టీవీ అందుబాటులో లేని వాళ్లు.. ప్రయాణాల్లో ఉన్నవాళ్లు మొబైల్స్ ద్వారా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడవచ్చు.

హాట్‌స్టార్ యాప్ సబ్‌స్క్రిప్షన్ లేనివాళ్ల కోసం మొబైల్ కంపెనీలు పలు ఆఫర్లను ప్రకటించాయి. జియో , వొడఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ సంస్థలు పలు ప్లాన్ల ద్వారా టీ20 వరల్డ్ కప్ వీక్షించేలా ఆఫర్లను ప్రకటించాయి. వీటిలో జియో మొబైల్ ఎన్నో అద్భుతమైన ఆఫర్లను ప్రత్యేకంగా వరల్డ్ కప్ కోసం అందుబాటులో ఉంచింది. కేవలం మ్యాచ్‌ల వీక్షణకే కాకుండా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ ఇండియా పాకిస్తాన్‌లు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో ఐదు సార్లు ఇండియానే విజయం సాధించింది. 2007లో రెండుసార్లు మ్యాచ్ జరుగగా..తొలి మ్యాచ్ టైగా ముగిసింది. అయితే బౌల్ అవుట్‌లో ఇండియా గెలిచింది. అ తరువాత ఫైనల్‌లో 5 పరుగుల తేడా విజయం సాధించి ధోనీ సేన ఛాంపియన్‌గా నిలిచింది.

గత మూడు ప్రపంచకప్‌లలో ఇండియా పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయం సాధించింది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడం విశేషం. ఇక 2007 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోహిత్ శర్మ వరుసగా ఏడవసారి ప్రపంచకప్ ఆడుతున్నాడు.