కరోనా మరణాల్లో మూడో స్థానానికి చేరిన భారత్

Advertisement

కరోనా దేశంలో విలయతాండవం చేస్తుంది. రోజుకు కొన్ని వేలమంది కరోనా భారిన పడుతుండగా, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దేశములో సంభవించిన కరోనా మరణాల వల్ల భారత్ కరోనా మరణాల్లో మెక్సికోను దాటి మూడో స్థానానికి చేరుకుంది. గడిచిన 24గంటల్లో మరో 948 కరోనా రోగులు మృతిచెందారు. ఆదివారంనాటికి దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 63,498కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

ఇదిలా ఉండగా వరుసగా నాలుగోరోజు 75వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా మరో 78,761పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 35లక్షల 42వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 27లక్షల మంది కోలుకోగా మరో ఏడు లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న మరో 64వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76శాతం దాటింది. మరణాల రేటు 1.8శాతంగా కొనసాగుతోంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here