మరో రెండు చైనీస్ యాప్స్ ను ప్లే స్టోర్స్ నుండి తొలగించిన భారత ప్రభుత్వం

Advertisement

ఢిల్లీ: గూగుల్ సెర్చ్, ట్విట్టర్ లకు ఆల్టర్ నేటివ్ గా ఉండే బైడు సెర్చ్, వెయిబో లాంటి యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్, అప్ప్లే ప్లే స్టోర్స్ నుండి తొలగించాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఈ యాప్స్ ను బ్యాన్ చేయనున్నారు. ఈ రెండు యాప్స్ ను కూడా భద్రతాపరమైన కారణాల వల్లే నిషేధించడం జరిగిందని అధికారులు తెలిపారు.

2015లో చైనాను ప్రధాని మోదీ సందర్శించినప్పుడు వెయిబోలో అకౌంట్ ను క్రియేట్ చేసుకున్నారు. అందులో తనకు రెండు లక్షలమంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం తన అకౌంట్ ను డిలీట్ చేశారు. చైనా యాప్స్ కు సంబంధించిన నిషేధం మొదట జూన్ 29న ప్రారంభమైంది. అప్పడు అధికారులు 47 యాప్స్ యొక్క వివరాలను వెల్లడించారు. ఆ తరువాత జూన్ 27న మరో కొన్ని యాప్స్ ను బ్యాన్ చేయబోతున్నామని అధికారులు ప్రకటించారు. టిక్ టాక్, షేర్ ఇట్, లైకీ, యూసీ బ్రౌసర్, హెలో, ఎంఐ కమ్యూనికేషన్, క్యామ్ స్కానర్ లాంటి వాటిని బ్యాన్ చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని యాప్స్ బ్యాన్ కానున్నాయి .

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here