నెగటివ్ లోకి పడిపోయిన భారత జీడీపీ, ఆర్థిక మాంద్యం రానుందా?

Advertisement

కరోనా వైరస్ మానవ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. లాక్ డౌన్ వల్ల ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మైనస్ 23.9 శాతానికి పడిపోయిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం సాయంత్రం వెల్లడించింది. దీనికి ముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతం వృద్ధి నమోదైంది.

1996 నుండి భారత్ త్రైమాసిక గణాంకాలు విడుదల చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇంత ఘోరమైన పతనం ఎప్పుడూ రాలేదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దీంతో దేశంలో ఆర్థిక మాంద్యం మొదలవుతుండవచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తదుపరి త్రైమాసికం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థిక మాంద్యం ఉన్నట్లుగా పరిగణిస్తారు. దేశ జీడీపీ నెగటివ్ లోకి పడిపోవడానికి ప్రధాని మోడీ అసమర్ధ పాలనే కారణమని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బ తినడానికి బాధ్యత వహిస్తూ ఆర్థిక శాఖ మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here