కరోనా మరణాల్లో త్వరలో బ్రిటన్ ను దాటనున్న భారత్

Advertisement

దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. రోజుకు కొన్ని వందలమంది ఈ కరోనా వల్ల మృత్యువాత పడుతున్నారు. గడిచిన 24గంటల్లో మరో 834 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో బుధవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 46,091కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో అత్యధిక మరణాలు సంభవిస్తోన్న దేశాల జాబితాలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్‌ మరణాల సంఖ్యకు భారత్ చేరువయ్యింది.

అలాగే నిన్న ఒక్కరోజే దేశంలో 60963 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులసంఖ్య 23,29,638కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 16లక్షల 39వేల మంది కోలుకోగా మరో 6లక్షల 43వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 56వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 70శాతానికి చేరింది. మరణాల రేటు 1.99శాతంగా కొనసాగుతోంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here