కరోనా కేసుల్లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన భారత్

Advertisement

దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 77,266 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 75,760 కేసులు బుధవారం-గురువారం మధ్య భారత్‌లోనే నమోదయ్యాయి. ఇక కొత్తగా 1,075 మంది మరణించడంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 61,529కి చేరింది.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 33,87,501కి పెరిగింది. వీరిలో 25,83,948 మంది కోలుకొని ఇళ్లకు చేరగా.. 7,42,023 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఒక్కరోజే 9,01,338 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 60,177 మంది కోలుకున్నారు. దీంతో కరోనా బారిన పడ్డవారిలో 76.28శాతం కోలుకున్నట్లయింది. ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నా కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ కరోనా దేశంలో ఇంకా ఎంతలా విజృంభిస్తుందో చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here