దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి

Advertisement

దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుమొఖం పడుతుంది. గత కొన్ని రోజులుగా దేశంలో నమోదు అవుతున్న కొత్త కరోనా కేసులు తగ్గుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 10,72,845 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా వీటిలో 83,808 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మంగళవారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 49,30,236కు చేరింది. వీరిలో ఇప్పటికే 38లక్షల మంది కోలుకోగా మరో 9లక్షల 90వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కానీ కరోనా మరణాల సంఖ్య మాత్రం ఇంకా భయాన్ని కలిగిస్తుంది. నిన్న ఒక్కరోజే మరో 1054 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 80,776కి చేరింది. అయితే, కొవిడ్‌-19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతానికి పైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78శాతానికి చేరడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. మరణాల రేటు మాత్రం 1.64శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here